SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR: రేవంత్ రెడ్డికి అసలు సిగ్గుందా..?.. తాగునీటి సమస్యలపై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

ktr fires on cm revanth reddy: తాగునీటికి కష్టంగా ఉంది.. బండ్లు కడగొద్దు, వారానికోసారి స్నానం చేయండని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటని కేటీఆర్ ఏకీపారేశారు. అసలు సీఎం రేవంత్ సర్కారు నడిపిస్తున్నారా..?..లేదా సర్కస్ చేస్తున్నారా..?.. అంటూ ఫైర్ అయ్యారు.

Written By Inamdar Paresh
Published: Nov 18, 2026, 13:13 IST | Updated: Nov 18, 2026, 13:23 IST
Image Credit: ktr on water crisis in telangana
Join

Ktr slams on cm revanth reddy govt over water crisis: తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం తాగు నీటి సమస్యల చుట్టు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో ప్రజలు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు తాగు నీటి సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు  పడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం నీళ్లను పొదుగా వాడుకొవాలని రైతన్నలు ఆరుతడి పంటలు వేసుకొవాలని సూచించారు.  దీనిపై తెలంగాణలో పార్టీల మధ్య ఇప్పటికే వార్ నడుస్తొంది. ఈ క్రమంలో కేటీఆర్  తాగునీటి సమస్యలపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు.

 

 


తెలంగాణలో నీటి కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమి కేటీఆర్ ఎద్దేవా చేశారు.  పక్కరాష్ట్రంకు ఉన్న ముందు చూపు కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఏకీపారేశారు. చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు కృష్ణా నీళ్లు తరలించుకుపోయారన్నారు. కానీ సీఎం రేవంత్ మాత్రం.. పాలమూరుకి 70 కిలోమీటర్ల పరిధిలోనే కృష్ణా నీళ్లున్నా పంప్‌లు నీళ్లను ఒడిసిపట్టలేదని విమర్శలు గుప్పించారు. శ్రీశైలం, జూరాల మొత్తం కలిపితే.. ఈ వానాకాలంలో 50 టీఎంసీల నీళ్లు కూడా ఎత్తలేదన్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉంటుందా?.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ ఫుల్ కెపాసిటీతో మోటార్లను సిద్ధం చేసి పెడితే.. రేవంత్ రెడ్డి వాడటం లేదని ఫైర్ అయ్యారు. తనను గెలిపించిన ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలను రేవంత్ ద్రోహం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ కు అసలు సిగ్గుందా అంటూ ఏకీపారేశారు. తాగునీటికి కష్టంగా ఉంది.. బండ్లు కడగొద్దు, వారానికోసారి స్నానం చేయండని రేవంత్ రెడ్డి చెప్తున్నారని సెటైర్లు వేశారు. కానీ.. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో తాగునీటికి సమస్య లేదని అంటున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నాగార్జున సాగర్‌లో 510 అడుగుల కింద పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే మీకు సోయి లేదా ఉత్తమ్?.. అంటూ కేటీఆర్ విమర్శించారు.

గత సమైక్య పాలనలో పోతిరెడ్డిపాడు పొక్క కొట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోయారన్నారు. ఇప్పుడు నాగార్జున్ సాగర్ వద్ద ఎలాంటి అనుమతులు లేని సొరంగం తవ్వి, నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డెడ్ స్టోరేజీలో పెట్టి.. కింది నుంచి నీళ్లు తీసుకుపోయే విధంగా వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీరే కాదు, సాగునీటితో కలిపి మొత్తం 90 టీఎంసీల నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 

కేసీఆర్ నాయకత్వంలో పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ కనిపించిందన్నారు. పాలమూరుకు నీళ్లు తీసుకురావడం వల్ల ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూలీలు వచ్చేవారన్నారు. చిత్తశుద్ధి గల నాయకత్వం ఉండే అద్భుతాలు చేయవచ్చు అని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అది మళ్లీ రివర్స్ అయ్యింది, పాలమూరులో వలసలు పెరిగాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో పాలమూరు, ఏపీలో అనంతపురం..  వీటిని వలసలు, కరువు జిల్లాలుగా చెప్పేవారని, అనంతపురంకు ప్రత్యేకంగా జీవ నది లేదన్నారు.  కానీ.. పాలమూరుని ఒరుసుకొని కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తుందన్నారు. కృష్ణా ప్రవహిస్తున్నా.. అందులో కూడా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్.. ఇది కాంగ్రెస్ చేసిన మొట్టమొదటి ద్రోహమన్నారు. 

10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఏలేశ్వరం ప్రాజెక్టును రద్దు చేసి.. కిందకు నందికొండకు తరలించారన్నారు. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు 8.8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని అప్పట్లో చెప్పారని, కానీ.. 6 లక్షల ఎకరాలు దాటలేదు, ఏపీలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్‌గా మార్చేశారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES