Hyderabad: హైదరాబాద్ జేఎన్టీయూలో షాకింగ్.. కూరలో స్విమ్ చేస్తున్న బల్లి.. వీడియో వైరల్..
Lizard found in curry in jntu hyderabad: రాత్రి పూట కూర వడ్డిస్తుండగా కొంత మంది కర్రీలో బల్లీని గమినించారు. వెంటనే క్యాంపస్ నిర్వాహకులకు సమాచారం అందించారు . దీనిపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Lizard found in curry in jntu hyderabad: ఇటీవల తరచుగా హోటళ్లు, రెస్టారెంట్ లలో, ఆన్ లైన్ లలో ఆర్డర్ చేసిన ఫుడ్ లలో బొద్దింకలు, బల్లులు, చనిపోయిన జీవుల అవశేషాలు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న కూడా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడంలేదు. చాలా చోట్ల హోటల్ సిబ్బంది పరిశుభ్రతను గాలికొదిలోసి కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక హస్టళ్లలో ఉంటూ చక్కగా చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఇలాంటి ఘటనల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లోని ప్రముఖ జేఎన్టీయూలో క్యాంపస్ లోని హస్టల్ లో కర్రీలో బల్లి పడ్డ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ప్రముఖ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లోని మంజీర హస్టల్ లో విద్యార్థులు రాత్రి పూట భోజనంకు వచ్చారు. ఇంతలో కర్రీ వడ్డిస్తుండగా గిన్నెలో కొంత మంది బతికున్న బల్లిని గుర్తించారు. అది ఏంచక్కా ఛోలె కర్రీలో అటు ఇటు గిన్నెలో స్విమ్ చేసుకుంటూ అటు ఇటు వెళ్తుంది. దీంతో విద్యార్థులు ఈ ఘటనను వీడియో తీసి ఉన్నతాధికారులకు, హస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు అప్పటికే కర్రీని తిన్న విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా గందర గోళంగా మారింది. విద్యార్థుల పట్ల ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా..?.. అంటూ హస్టల్ లోని వారంతా నిరసనలకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై హస్టల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.