• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /మేడ్చల్ రోడ్లకు మహర్దశ.. రూ.5.20 కోట్లతో కీలక అభివృద్ధి పనులు!

మేడ్చల్ రోడ్లకు మహర్దశ.. రూ.5.20 కోట్లతో కీలక అభివృద్ధి పనులు!

Latest Medchal News: మేడ్చల్ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేకమైన చొరవతో ఈ నిధులు విడుదలైనట్లు మున్సిపల్ వాయిస్ ఛైర్మన్ తెలిపారు. వీటి ద్వారా వివిధ రోడ్లను పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 02:53 PM IST|Updated: Sep 27, 2026, 02:55 PM IST
joinshare
మేడ్చల్ రోడ్లకు మహర్దశ.. రూ.5.20 కోట్లతో కీలక అభివృద్ధి పనులు!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Medchal Road Development News: మేడ్చల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను అందిస్తోందని.. అందులో భాగంగానే మరో కీలక ముందడుగు పడిందని ఎల్లంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేకమైన చొరవతో హెచ్‌ఎండీఏ ద్వారా నియోజకవర్గ పరిధిలోని కీలక రహదారుల అభివృద్ధికి మొత్తం రూ.5.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆమె వెల్లడించారు..

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను గుర్తించి.. అత్యవసరమైన రహదారులను రిపేర్లు చేసేందుకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా రోడ్ల ఆధునీకరణకు కూడా ఈ నిధులనే వినియోగించబోతున్నట్లు వెల్లడించారు..

శ్రీరంగవరం బీటీ రోడ్డు విస్తరణకు రూ.3 కోట్లు..
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం గ్రామం మీదుగా జిల్లా పరిధిలోని శ్రీరంగవరం ఉన్నత పాఠశాల వరకు ఉన్న ప్రత్యేకమైన రహదారిని పూర్తిస్థాయిలో బీటీ రోడ్డుగా విస్తరించడంతోపాటు.. వివిధ రకాల పనుల కోసం దాదాపు మూడు కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు రైతులు స్థానికులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం విస్తరణకు నోచుకోవడం వల్ల ప్రయాణం మరింత వేగవంతంగా ఆరబోతుందన్నారు.

దేవరయాంజాల్ పరిధిలో బీటి రోడ్డు..
అలాగే దేవరయాంజాల్ పరిధిలోని మందాయిపల్లి రోడ్డు నుంచి దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రోడ్డు వరకు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణానికి దాదాపు 2.2 కోట్ల నిధులు మంజూరైనట్లు కూడా తెలిపారు. ఓ ఆర్ ఆర్ అనుసంధానం మార్గంగా.. ఈ రోడ్డు అభివృద్ధి చెందడం వల్ల ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు..

ఈ అభివృద్ధి పనులు త్వరగా మొదలై.. పూర్తయితే, ఆయా ప్రాంతాల ప్రజలకు అద్భుతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు. నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండి.. అభివృద్ధి నిధుల మంజూరులో విశేష కృషి చేసిన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కు మున్సిపాలిటీ ప్రజలతో పాటు మున్సిపల్ వాయిస్ ఛైర్మన్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Hyderabad