SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పోలీస్ స్టేషన్‌లోనే భారీ చోరీ.. రూ.12 లక్షల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్!

Meerpet Police Station Theft: ఒక పోలీస్ కానిస్టేబుల్ స్టేషన్‌లో భద్రపరిచిన సొత్తును కాజేసిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. తన తండ్రి తీవ్ర అనారోగ్యం కారణంగా చేతుల్లో డబ్బులు లేకపోవడంతో స్టేషన్లోని సొత్తును కాజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 12:52 PM IST | Updated: Nov 01, 2026, 12:55 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Meerpet Police News: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఒక అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేసుల దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకొని భద్రపరిచిన సొమ్ముకే ఓ కానిస్టేబుల్ కన్నేశాడు. కష్టాల్లో ఉన్న తండ్రిని కాపాడుకోవాలన్న ఆరాటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని నేరబాట పట్టించాయి.. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఉదంతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అసలు ఈ ఘటన ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మీర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌కు స్టేషన్ రికార్డులు, స్వాధీనం చేసుకున్న ఆస్తులపై పర్యవేక్షణ ఉంది. వివిధ నేర పరిశోధనల్లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలు, పలు మొబైల్ ఫోన్లను పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు. అయితే, ఆ వస్తువులను ఎవరికి అనుమానం రాకుండా పక్కదారి పట్టించిన శ్రవణ్ కుమార్.. ఆ బంగారాన్ని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టుపెట్టి సుమారు రూ.12 లక్షల నగదును పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే కొన్ని మొబైల్ ఫోన్లతో పాటు నగదును కూడా వ్యక్తిగత అవసరాలకు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు..

ఈ వ్యవహారం వెనుక ఉన్న కారణాలను విశ్లేషించక బాగోద్వేగమైన నేపథ్యం బయటపడింది.. శ్రవణ్ కుమార్ తండ్రి తీవ్రమైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చయ్యాయి.. అప్పటికి చేసిన అప్పులు తీరకపోవడంతో పాటు మరోవైపు రోజు వారి అవసరాలకు డబ్బులు అవసరం కావడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆయన కూరుకుపోయాడు.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన.. మన తండ్రి ప్రాణాలను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో స్టేషన్లో ఉన్న సీజుడ్ సొత్తును తాకట్టు పెట్టే తప్పు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇంత చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆయన తండ్రి ఇటీవల చికిత్స పొందుతూ మరణించాడు..

స్టేషన్‌లోని కేసు ప్రాపర్టీల తనిఖీల్లో తేడాలు రావడంతో ఉన్నత అధికారులు లోతుగా ప్రత్యేకమైన విచారణ చేపట్టారు. శ్రవణ్ కుమార్ చేతివాటం బట్టబయలు కావడంతో మీర్పేట్ పోలీసులు ఆయనపై శాఖాపరమైన విచారణతో పాటు ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. శ్రవణ్ కుమార్ ను అధికారికంగా అరెస్టు చేసి.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.. అంతేకాకుండా శ్రవణ్ కుమార్ కు సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆయన చేసింది తప్పేమీ కాదని కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES