• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Buffalo Birthday Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక రైతు తన పెంచుకుంటున్న గేదెకు పుట్టినరోజు వేడుకలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ గేదె ముందు కేకు ఉంచి కట్ చేసిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 02:42 PM IST|Updated: Nov 01, 2026, 02:44 PM IST
joinshare
గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

2

ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

3

ఈ రైలుకు 90 ఏళ్ల చరిత్ర ఉంది.. దీని పేరుపై ఓ మూవీ కూడా ఉంది.. ఈ రైలును ఎందుకు ఆపేశారు..!

4

గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Buffalo Birthday Video: మనిషికి, పెంపుడు జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఎప్పుడు స్వచ్ఛమైంది గానే భావిస్తూ ఉంటారు. సాధారణంగా ఇళ్లలో కుక్కలతో పాటు బిల్లులు పుట్టినరోజు వేడుకలు జరపడం.. వాటికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. అయితే, గ్రామాల్లో తమ కష్టాసుఖాల్లో భాగమై.. జీవనాధారంగా నిలిచే పాడి పశువులను కూడా కుటుంబ సభ్యుల చూసుకునే కొందరు రైతుల ప్రేమ అంతకంటే గొప్పది.. తాజాగా ఓ రైతు తన గేదపై చూపించిన నిస్వార్ధమైన ప్రేమ సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో మెప్పిస్తోంది..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. పచ్చని పల్లెటూరి వాతావరణం లో సదరు యజమాని తన ప్రియమైన గేదె పుట్టినరోజును ఎంతో వేడుకగా నిర్వహిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లల పుట్టిన రోజులకు పెట్టినట్లే గేదె తలపై ముచ్చటైన కలర్ఫుల్ బర్త్డే క్యాప్ నువ్వు పెట్టి.. దాని ఎదురుగా ఒక అందమైన కేకును ముంచి.. ఎంతో సంబరంగా చిరునవ్వులు చిందిస్తూ ఆ కేకును కట్ చేశాడు. ఈ ఆ సమయంలో గేదె కూడా ఏమాత్రం భయపడకుండా తన యజమాని ప్రేమను ఆస్వాదిస్తున్నట్లు నిశ్శబ్దంగా నిలుచుని చూస్తుండి పోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు..

కేకు కట్ చేస్తున్న సమయంలో ఆ యజమాని ముఖంలో కనిపించిన వెలకట్టలేని సంతోషం ఈ వీడియోకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు.. కేవలం పాలు ఇచ్చే పశువుగా మాత్రమే కాకుండా ఇంటిలో ఒక ప్రాణంగా దానిని భావించి చేసిన ఈ వేడుక చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పట్ల రైతులకు ఉండే ప్రేమ, అనురాగాలకు ఈ వీడియో అద్దం పడుతోందని భావించవచ్చు..

ఈ వీడియో వివిధ సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో.. కొన్ని రోజుల వ్యవధిలోనే ట్రెండింగ్ ఆ నిలిచింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంపాదన ఉన్నవారు కుక్కలకు చేస్తారు.. కానీ సంస్కారం ఉన్న పల్లెటూరి రైతులు తన కష్టాన్ని పంచుకునే జీవానికి పుట్టినరోజులు చేస్తారని కామెంట్లు పెడుతున్నారు.. ఈ రోజుల్లో ఇంతటి అద్భుతమైన ప్రేమ చూడటం చాలా అరుదు అంటూ మరొక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ చేశాడు. ఇలా సోషల్ మీడియా వినియోగదారులు ఎవరికి నచ్చిన రీతిలో వారు ఆ రైతు ఆనందం గురించి కామెంట్లు పెడుతూ వస్తున్నారు..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by gold.star_venkaiah_7941 (@gold_star_venkaiah_7941)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News