• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!

కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!

Kashmir Saffron: కుంకుమపువ్వు ఎందుకంత రేటు ఉంటుందో ఎవరికైనా తెలుసా? అంతేకాకుండా మన కాశ్మీర్ లోయల్లో పండే కేజీ కుంకుమపువ్వు తీయాలంటే ఎన్ని పువ్వులను కోయాల్సి ఉంటుందో తెలుసా? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 02:36 PM IST|Updated: Nov 01, 2026, 02:38 PM IST
joinshare
కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

మావోయిస్టులు మళ్లీ పుడతారు.. మాజీ సీఎం సంచలన కామెంట్స్..!!

2

ఇల్లీగల్ ఎఫైర్స్‌కు నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి.. గరుడ పురాణం ఏం చెబుతోంది..

3

ఈ రైలుకు 90 ఏళ్ల చరిత్ర ఉంది.. దీని పేరుపై ఓ మూవీ కూడా ఉంది.. ఈ రైలును ఎందుకు ఆపేశారు..!

4

గేదెకు గ్రాండ్ బర్త్‌డే పార్టీ.. కేక్ కట్ చేసిన రైతు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

కాశ్మీర్ లోయ అందాలు.. లక్షన్నర పూలకు.. ఒక్క కిలో కుంకుమపువ్వు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kashmir Saffron: శరత్ ఋతువు రాకతో కాశ్మీరు లోయ సరికొత్త అందాలను సంతరించుకుంటూ వస్తోంది. శ్రీనగర్ కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలో పుల్వామా జిల్లా పాంపోర్ పరిసరాలు రాత్రికి రాత్రే కుంకుమ పువ్వు రంగులోకి మారిపోయాయి.  ఏడాది మొత్తంలో కేవలం మూడు వారాల పాటు మాత్రమే కనువిందు చేసే క్రోకస్ సటైవస్ పూత ప్రారంభం అవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో మొదలయ్యే ఈ పూత నవంబర్ మధ్య నాటికి ముగుస్తుంది. కాశ్మీర్ లో ఉత్పత్తి అయ్యే కుంకుమ పువ్వులో సుమారు 80 శాతం ఒక పాంపోర్ ప్రాంతంలోనే పండుతూ ఉంటుంది.. అంతేకాకుండా ఇక్కడ పండే కుంకుమ పువ్వుకు ఎంతగానో డిమాండ్ ఉంటుంది.  

ఈ పూత వెనక రైతుల ఏడాది కష్టం దాగి ఉంటుంది.. మార్చితో పాటు ఏప్రిల్ నెలలో పొలాలను దుక్కు దున్ని. వేసవిలో తేమ ఆరిపోకుండా నేలను సిద్ధం చేస్తూ ఉంటారు. జులై ఆఖరిలో కుంకుమ పువ్వుకు సంబంధించిన మొక్కలను నాటుతూ ఉంటారు.. ఇక సెప్టెంబర్ తో పాటు అక్టోబర్ నెలలో కురిసే వర్షాలు.. ఆ తర్వాతి నెలలో వచ్చే చల్లటి గాలులు పువ్వులకు సంబంధించిన మొగ్గలను తొడిగేందుకు ఎంతగానో సహాయ పడతాయి.. వాతావరణం అనుకూలించిన వెంటనే అన్ని పొలాల్లో కుంకుమపువ్వు విరబూస్తూ ఉంటుంది..

పువ్వులు వికసించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంటలను సేకరించాల్సి ఉంటుంది.. కుటుంబ సభ్యులంతా తెల్లవారుజామునే మందము దుస్తులను ధరించి బుట్టలతో పొలాల్లోకి దిగుతూ ఉంటారు. పూలు పూర్తిగా విచ్చుకున్న సమయంలోనే.. వాటిని అత్యంత సున్నితంగా చేతులతోనే కోస్తూ ఉంటారు.. ఏ ఒక్క పువ్వు మిస్ అవ్వకుండా ప్రతి పొలాన్ని రైతులు మూడుసార్లు పరిశీలించి కోతను పూర్తి చేస్తూ ఉంటారు..

కుంకుమపువ్వు ధర మార్కెట్లో ఎందుకంత ఎక్కువగా ఉంటుందో.. దాని దిగుబడి లెక్కలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది.. ప్రతి పువ్వులో కేవలం మూడు ఎర్రటి కేశారాలు మాత్రమే ఉంటాయి.. ఒక కిలో నాణ్యమైన ఎండు కుంకుమ పువ్వు రావాలంటే దాదాపు 1,50,000 పూలను కోయాల్సి ఉంటుందని అక్కడి రైతులు చెబుతూ ఉంటారు. పోసిన పూల నుంచి ఆ సున్నితమైన కేసరాలను వేరు చేసే పని ఇళ్లలోనే చేస్తూ ఉంటారు.

నవంబర్‌తో పాటు డిసెంబర్ నెలలో కుటుంబాలు, బంధువులు ఒకేచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ అక్కడి జానపద పాటలు పాడుకుంటూ ఈ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. పంట ప్రారంభమైన రోజున రైతులు పాంపోర్‌లోని హజ్రత్ షేక్ షరీఫ్-ఉద్-దిన్ దర్గాలో తమ మొదటి పంటను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తోందట..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News