Dandia Bouncers Issue: దాండియా ఉత్సవాల్లో ఓ వర్గ బౌన్సర్ల బహిష్కరణ వివాదంపై తెలంగాణలో రచ్చ తీవ్రమైంది. ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య వివాదం ఏర్పడింది. ఓ వర్గం బౌన్సర్లకు మద్దతుగా ఒవైసీ చేసిన ట్వీట్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. 'మా పండుగ దాండియా కార్యక్రమాల్లో ఓ వర్గం బౌన్సర్లు ఉండాలని చెప్పడానికి నువ్వెవరు? దాండియాలో ఆ వర్గం బౌన్సర్లను పెడితే హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ లాంటి చర్యలు ఉండే ప్రమాదం ఉంది' అని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై ఇప్పటికే హిందూ సంఘాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు.
'హిందూ కార్యక్రమాలకు హిందూ బౌన్సర్లు ఉండాలా? ఓ వర్గం బౌన్సర్లు ఉండాలా? అని నిర్ణయించేందుకు నీకు ఏమీ అధికారం ఉంది. అసలు నువ్వెవరు?' అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. దాండియా కార్యక్రమాల్లో ముస్లిం బౌన్సర్లు ఉండరాదనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్వాహకులకు ఉందని స్పష్టం చేశారు. అది నీకు కాదు ఓవైసీ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతా ఇష్టముంటే నువ్వు ఒక దాండియా కార్యక్రమం పెట్టించు అని సవాల్ విసిరారు.
हमारे हिंदू उत्सव में बाउंसर हिंदू होगा या मुसलमान, यह तय करने वाले तुम कौन होते हैं, ओवैसी ? हमारे धार्मिक आयोजनों के फैसले समाज और आयोजक करेंगे, कोई राजनीतिक नेता नहीं। https://t.co/ybCEB3zDiF
— Raja Singh (@TigerRajaSingh) October 6, 2026
'ఓ వర్గం అమ్మాయిలు, అబ్బాయిలతో దాండియా ఆడించు. ఇందులో ఆ వర్గం బౌన్సర్లను పెట్టుకోండి. దాండియా ఉత్సవాల్లో ఓ వర్గం బౌన్సర్లను పెట్టొద్దు. హిందూ పండుగకు హిందూ బౌన్సర్లే ఉండాలి. దాండియా కార్యక్రమాల్లో హిందూ బౌన్సర్లు పెట్టడం స్వాగతిస్తున్నా. ముస్లిం బౌన్సర్లను పెడితే కార్యక్రమం ఆపుతాం' అని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈ వివాదంతో దాండియా ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
ఇంతకీ అసదుద్దీన్ ఏమన్నాడంటే?
'కొన్ని సంస్థల ఒత్తిడి కారణంగా ఈవెంట్ నిర్వాహకులు తమను బహిష్కరిస్తున్నారని ముస్లిం బౌన్సర్లు, ఇతర కార్మికులు వాపోతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ విషపూరిత ధోరణిని అరికట్టవచ్చు. ఈ దుర్మార్గపు చర్యకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడాలి. లేకపోతే రాష్ట్ర పురోగతి, అభివృద్ధి కూడా దెబ్బతింటుంది' అని 'ఎక్స్'లో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోస్టు చేశారు.
Muslim bouncers and other workers have reported that event organisers are boycotting them under pressure from extremist organisations. This poison can be curbed if the police take strict action. More importantly, the people of Telangana must stand united across religions against this evil. Otherwise, the state’s progress and development will also become a victim.
— Asaduddin Owaisi (@asadowaisi) October 6, 2026