SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dandia Bouncers: దాండియా ఉత్సవాలపై రగిలిన వివాదం.. అసదుద్దీన్‌పై రాజాసింగ్‌ ఆగ్రహం

MLA Raja Singh Condemns Asaduddin Owaisi Comments About Bouncers Issue: బౌన్సర్ల బహిష్కరణ అంశం ఇద్దరు ప్రముఖ నాయకుల మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. దసరా సందర్భంగా జరిగే దాండియా ఉత్సవాల్లో ఓ వర్గం బౌన్సర్లను బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పిలుపునివ్వగా.. దానిని ఖండిస్తూ నువ్వెవరు అంటూ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 06, 2026, 03:54 PM IST | Updated: Oct 06, 2026, 04:02 PM IST
Image Credit: Asaduddin Owaisi vs Raja Singh
Join

Dandia Bouncers Issue: దాండియా ఉత్సవాల్లో ఓ వర్గ బౌన్సర్ల బహిష్కరణ వివాదంపై తెలంగాణలో రచ్చ తీవ్రమైంది. ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ వర్సెస్ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య వివాదం ఏర్పడింది. ఓ వర్గం బౌన్సర్లకు మద్దతుగా ఒవైసీ చేసిన ట్వీట్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్‌ ఇచ్చారు. 'మా పండుగ దాండియా కార్యక్రమాల్లో ఓ వర్గం బౌన్సర్లు ఉండాలని చెప్పడానికి నువ్వెవరు? దాండియాలో ఆ వర్గం బౌన్సర్లను పెడితే హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ లాంటి చర్యలు ఉండే ప్రమాదం ఉంది' అని రాజాసింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై ఇప్పటికే హిందూ సంఘాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు.

'హిందూ కార్యక్రమాలకు హిందూ బౌన్సర్లు ఉండాలా? ఓ వర్గం బౌన్సర్లు ఉండాలా? అని నిర్ణయించేందుకు నీకు ఏమీ అధికారం ఉంది. అసలు నువ్వెవరు?' అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. దాండియా కార్యక్రమాల్లో ముస్లిం బౌన్సర్లు ఉండరాదనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్వాహకులకు ఉందని స్పష్టం చేశారు. అది నీకు కాదు ఓవైసీ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. అంతా ఇష్టముంటే నువ్వు ఒక దాండియా కార్యక్రమం పెట్టించు అని సవాల్‌ విసిరారు.

'ఓ వర్గం అమ్మాయిలు, అబ్బాయిలతో దాండియా ఆడించు. ఇందులో ఆ వర్గం బౌన్సర్లను పెట్టుకోండి. దాండియా ఉత్సవాల్లో ఓ వర్గం బౌన్సర్లను పెట్టొద్దు. హిందూ పండుగకు హిందూ బౌన్సర్లే ఉండాలి. దాండియా కార్యక్రమాల్లో హిందూ బౌన్సర్లు పెట్టడం స్వాగతిస్తున్నా. ముస్లిం బౌన్సర్లను పెడితే కార్యక్రమం ఆపుతాం' అని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరించారు. ఈ వివాదంతో దాండియా ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

ఇంతకీ అసదుద్దీన్‌ ఏమన్నాడంటే?
'కొన్ని సంస్థల ఒత్తిడి కారణంగా ఈవెంట్ నిర్వాహకులు తమను బహిష్కరిస్తున్నారని ముస్లిం బౌన్సర్లు, ఇతర కార్మికులు వాపోతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ విషపూరిత ధోరణిని అరికట్టవచ్చు. ఈ దుర్మార్గపు చర్యకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడాలి. లేకపోతే రాష్ట్ర పురోగతి, అభివృద్ధి కూడా దెబ్బతింటుంది' అని 'ఎక్స్‌'లో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పోస్టు చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES