Nine family members fall ill after eating biryani in hyderabad: ఇటీవల హైదరాబాద్ లో తరచుగ హోటళ్లు, రెస్టారెంట్ లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహరపదార్థాల్ని తయారు చేస్తున్నారు. కాలం చెల్లిపోయిన వాటిని చాలా రోజుల పాటు ఫ్రిడ్జీలో పెట్టి మరీ వినియోగిస్తున్నారు. దీని వల్ల కస్టమర్లు తరచుగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఫుడ్ సెఫ్టీ అధికారులు ఎన్నిమార్లు దాడులు చేసిన కూడా చాలా మందిలో ఇప్పటికి మార్పులు రావడంలేదు. మరోవైపు నగరం వ్యాప్తంగా ఇష్టమున్నట్లు మండీ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అంబర్ పేట్ లో ప్రముఖ మండీలో బిర్యానీ తిన్న ఒక కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్ అంబర్‌పేటలో గల ముక్రం హోటల్‌లో స్థానికంగా ఉన్న కుటుంబం మండీలో బిర్యానీ తిని అస్వస్థకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల ప్రకారం.. ఈనెల 15న అంబర్ పేట్ పరిధిలోని గాంధీ బొమ్మ వద్ద ఉన్న ముక్రమ్ బిర్యానీ సెంటర్ నుంచి బిర్యానీ తెప్పించుకుని కుటుంబ సభ్యులు తిన్నారు. అయితే బిర్యానీ తిన్న కొన్ని గంటలకే కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యంకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వెంటనే ఇంట్లోని వారు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన విధంగా స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత మరల ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మందిలో ఐదుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
వీరిని నల్లకుంటలోని ఫివర్ ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళకు న్యూరో సమస్య తలెత్తడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ కు గురైన వారిలో.. సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తాన, కాచిగూడ నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్ ఆమీర్ ఉన్నారు. ఈ ఘటనతో బిర్యానీ ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.