SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hitech City Job Fair 2026: హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026.. భారీగా హాజరైన నిరుద్యోగులు

Hitech City Job Fair 2026: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వేదికగా నిర్వహించిన ‘హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026’కు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ సాంగ్ టీమ్ నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 70కి పైగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొని.. అర్హులైన నిరుద్యోగులకు సుమారు 1,000కి పైగా ఉద్యోగావకాశాలను కల్పించాయి.

Written By Ashok Krindinti
Published: Sep 29, 2026, 06:53 PM IST | Updated: Sep 29, 2026, 07:02 PM IST
Image Credit: Hitech City Job Fair 2026
Join

Hitech City Job Fair 2026: వినోదంతో పాటు సామాజిక బాధ్యతను చాటుతూ ‘ఓ నా సిద్ధయ్య’ ప్రైవేట్‌ ఆల్బమ్ బృందం హైటెక్‌ సిటీ వేదికగా భారీ జాబ్ మేళా నిర్వహించింది. శిల్పారామం సమీపంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌, సైబర్‌ గార్డెన్స్‌లో హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026 మేళాకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేవలం వినోదానికే పరిమితం కాకుండా నిరుద్యోగులకు ఉపాధి, సమాజ హిత కార్యక్రమాలు చేపట్టడమే తమ లక్ష్యమని చిత్ర బృందం పేర్కొంది. ఈ జాబ్‌ఫెయిర్‌కు హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిలోఫర్‌ కేఫ్‌ అధినేత బాబూరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులను అభినందించారు. ఈ సాంగ్‌లో యాక్ట్ చేసిన సిద్ధు రెడ్డి కందకట్ల, కాత్యాయిని జగన హాజరయ్యారు.

ఈ జాబ్‌ మేళాలో టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, జెన్‌పాక్ట్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్ డిజిటల్, యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా 70కి పైగా ప్రముఖ ఐటీ, నాన్‌-ఐటీ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మసీ, ఆటోమొబైల్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, వాయిస్‌, నాన్‌-వాయిస్‌ వంటి పలు విభాగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. 10వ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన ఫ్రెషర్లు, అనుభవజ్ఞులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత సాధించిన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు.

ఈ సందర్భంగా సమాజ సేవలో భాగంగా 300 మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు రూ.3 లక్షల విలువైన ఆరోగ్య బీమా అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ.10.50 లక్షల వరకు ఆర్థిక సాయం లభించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ‘ఓ నా సిద్ధయ్య’ పాటకు తెరవెనుక పనిచేసిన డైరెక్షన్, కెమెరా తదితర సాంకేతిక సిబ్బందికి కూడా భరోసానిస్తూ బీమా సౌకర్యం కల్పించారు. ప్రాజెక్టు వెనుక పనిచేసిన వారికి అండగా నిలవడమే దీని ఉద్దేశమన్నారు.

‘ఓ నా సిద్ధయ్య’ పాటకు రామ్‌ అద్నాన్‌ దర్శకత్వం వహించడంతోపాటు శ్రీనిధితో కలిసి ఆలపించారు. కళ్యాణ్‌ కీస్‌ సంగీతం అందించారు. అరుణ్‌ కొలుగూరి డీవోపీగా వ్యవహరిస్తూ.. ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. వినోద పరిశ్రమ నుంచి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES