SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Old Rupee Scam: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉందా? ఒక్కో నోటుకు రూ.45 లక్షలు ఆఫర్..కట్‌చేస్తే..!

Hyderabad Old Rupee Scam: పాత ఒక రూపాయి నోటుకు రూ. 45 లక్షలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక వ్యక్తి వద్ద నుండి రూ. 7.93 లక్షలకు పైగా కాజేసిన ఘరానా మోసాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ దర్యాప్తులో కేవలం ఒక మోసమే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించిన దాదాపు రూ. 60 కోట్ల నుండి రూ. 70 కోట్ల సైబర్ స్కామ్ కోణం వెలుగులోకి వచ్చింది. ఆ సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Written By Harish Darla
Published: Oct 12, 2026, 05:02 PM IST | Updated: Oct 12, 2026, 05:05 PM IST
Image Credit: Source: Zee Telugu News
Join

Hyderabad Old Rupee Scam: హైదరాబాద్ పరిధిలోని రామాంతపూర్‌కు చెందిన గుమ్మ రమేష్ (39), ముదలే అనిల్ (19) అనే ఇద్దరు కేటుగాళ్లు పాత ఒక్క రూపాయి నోటుకు రూ. 45 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా బాధితుడిని సంప్రదించారు. అతడిని నమ్మించి విడతలవారీగా మొత్తం రూ. 7,93,351 కాజేశారు. 

బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అమాయకుల బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డుల విక్రయం..
పోలీసుల విచారణలో నిందితులు సాగించిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ర్యాపిడో, ఉబర్ సంస్థల్లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన రమేష్, రామాంతపూర్ పరిసరాల్లోని విద్యార్థులు, డెలివరీ బాయ్స్, ఇతర అమాయక ప్రజలను సంప్రదించేవాడు. వారికి కమీషన్లు ఇస్తామని ఆశ చూపి వారి బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులను తీసుకునేవాడు. 

అలా సుమారు 60 నుండి 70 మందికి చెందిన బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, సిమ్ కార్డులను సేకరించి, కొరియర్ ద్వారా హర్యానాలోని సైబర్ నేరగాళ్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది.

450 కేసులు, రూ. 70 కోట్ల స్కామ్..
సైబర్ నేరగాళ్లు ఈ ఖాతాలను 'మ్యూల్ అకౌంట్లు'గా (Mule Accounts) ఉపయోగించి సైబర్ నేరాల ద్వారా వచ్చిన నిధులను బదిలీ చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు విక్రయించిన ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన 450 సైబర్ క్రైమ్ కేసులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 60 కోట్ల నుండి రూ. 70 కోట్ల వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES