• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌

AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌

AP Govt Reservations Finalized 17 Mayors And 106 Municipal Chairman Posts: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌ పదవులకు.. మున్సిపల్‌ చైర్మన్‌ల పదవులకు రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 12, 2026, 06:24 PM IST|Updated: Oct 12, 2026, 06:29 PM IST
joinshare
AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌
Image Credit: AP Municipal Reservations

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

Tragedy Accident: విజయవాడలో ఘోర ప్రమాదం.. బైపాస్‌ రోడ్డులో ఈవీ కారు దగ్ధమై నలుగురు మృతి

2

AP Municipal Reservations: ఏపీలో మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు 50 శాతం రిజర్వ్‌

3

పవన్ కళ్యాణ్@30ఇయర్స్ ఇండస్ట్రీ.. అల్లు అరవింద్ సహా ప్రముఖుల ప్రశంసలు..

4

Bhogapuram Airport Bus Pass: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్..10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం..ఆ ఊర్లో మాత్రమే?

5

Sachin Tendulkar: కూతురు సారా కోసం సచిన్ ఎమోషనల్ పోస్ట్.. తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Municipal Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడో రేపో ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మేయర్‌, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28 జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాల్లో బీసీలకు 7 స్థానాలు, 661 జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు, 661 ఎంపీపీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు, 9,913 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 2,400 స్థానాలు, 13,351 సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 3,128 స్థానాలు ఏపీ ప్రభుత్వం కేటాయించింది.

106 మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు కల్పించగా.. వాటిలో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు. ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ఏపీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. మేయర్ పదవుల రిజర్వేషన్లపై ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్ పదవులు ప్రభుత్వం కేటాయించింది. బీసీలకు ఐదు మేయర్ పదవులు.. మహిళలకు ఐదు పదవులు రిజర్వ్ చేసింది.

మరో నాలుగు కార్పొరేషన్లలో అన్‌రిజర్వుడ్ కేటగిరీలో మేయర్ పదవులు, మంగళగిరి-తాడేపల్లి మేయర్ పదవి ఎస్టీ జనరల్‌కు ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయగా.. రాజమహేంద్రవరం మేయర్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాకినాడ, మచిలీపట్నం మేయర్ పదవులు బీసీ మహిళలకు కేటాయించగా.. ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ పదవులు బీసీ జనరల్‌కు ప్రభుత్వం రిజర్వ్‌ ఖరారు చేసింది. విజయనగరం, శ్రీకాకుళం మేయర్ పదవులు మహిళలకు రిజర్వ్ చేయగా.. గుంటూరు, కడప మేయర్‌ పదవులతోపాటు జీవీఎంసీ (విశాఖపట్టణం) మేయర్ పదవి కూడా ప్రభుత్వం మహిళలకు రిజర్వ్ చేసింది. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ పదవులు అన్‌రిజర్వుడ్ చేసింది.


మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఇలా..

ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు) - 3
ఎస్టీ - మహిళ: గూడూరు
ఎస్టీ - జనరల్: ఆత్మకూరు, ఆలూరు

ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు) - 14
ఎస్సీ - మహిళ: కొండపల్లి, నిడదవోలు, యలమంచిలి, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల
ఎస్సీ - జనరల్: ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి

బీసీ (వెనుకబడిన తరగతులు) - 35
బీసీ - మహిళ: జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట, చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం
బీసీ - జనరల్: కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేల్

జనరల్ కేటగిరీ (మహిళ): 27
కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాలెం, యర్రగుంట్ల, యలమంచిలి, కళ్యాణదుర్గం, ఆముదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు

జనరల్ (అన్‌రిజర్వ్డ్ ): 26
పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, రామచంద్రాపురం, సత్తెనపల్లె, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గ్, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిపత్రి, పిడుగురాళ్ల

Add Zee News as a Preferred Source
TAGS:
Politics
Andhra Pradesh
Chandrababu Naidu
Telugu News