• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అసలు కారణం ఏమిటంటే..?..

Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అసలు కారణం ఏమిటంటే..?..

Hyderabad Traffic police: ఛే నంబర్ జంక్షన్ నుంచి తిలక్ నగర్ వరకు జరుగుతున్న హైడ్రా పనుల కారణంగా (వన్-వే) అనుమతిస్తారని హైదరాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటు తిలక్ నగర్ నుంచి 6 నంబర్ జంక్షన్ వైపునకు వాహనాలకు ప్రవేశం నిషేధం అమలు చేస్తారు.

Written ByInamdar Paresh
Published: Nov 16, 2026, 18:59 IST|Updated: Nov 16, 2026, 19:12 IST
joinshare
Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అసలు కారణం ఏమిటంటే..?..
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Traffic restrictions these route in hyderabad: హైదరాబాద్ లో ఇటీవల రద్దీ విపరీతంగా పెరిగి పోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఎప్పటి కప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్దికరిస్తున్నారు. మరోవైపు నగరంలో ఎక్కడైనే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటే పోలీసులు ముందుగానే ప్రకటన చేస్తున్నారు. దీంతో వాహన దారులు అలర్ట్ అయి  ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా.. ఛే నంబర్, తిలక్ నగర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఇది గమనించి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకొవాలని పోలీసులు సూచించారు.


ఛే నంబర్ జంక్షన్ నుంచి తిలక్ నగర్ వరకు ఉన్న రహదారి మార్గంలో 'హైడ్రా'  చేపడుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
16.11.2026 నుంచి 20.12.2026 వరకు ఈ క్రింది ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.


1. వన్-వే విధానం:

ఛే నంబర్ జంక్షన్ నుంచి తిలక్ నగర్ వరకు జరుగుతున్న హైడ్రా పనుల కారణంగా, కేవలం 6 నంబర్ జంక్షన్ నుంచి తిలక్ నగర్ వైపునకు మాత్రమే వాహనాలను (వన్-వే) అనుమతించబడును. అంతే కాకుండా.. తిలక్ నగర్ నుంచి 6 నంబర్ జంక్షన్ వైపునకు వాహనాలకు ప్రవేశం నిషేధించబడింది.


2. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల డైవర్షన్..

ఎ) ఎన్.సి.సి (NCC) నుంచి అంబర్‌పేట వైపు వెళ్లేవి: ఎన్.సి.సి - తిలక్ నగర్ కుడివైపు (Right) - ఫీవర్ ఆసుపత్రి - బర్కత్‌పురా చమన్ - టూరిస్ట్ హోటల్ - నింబోలిఅడ్డ - గోల్నాక - 6 నంబర్ జంక్షన్ - అంబర్‌పేట మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

బి) విద్యానగర్ నుండి ఫీవర్ ఆసుపత్రి మీదుగా అంబర్‌పేట వైపు..

ప్రత్యామ్నాయ మార్గం - 1: విద్యానగర్ - ఫీవర్ ఆసుపత్రి - త్యాగరాయ గానసభ / టీ.వై. మండలి (Ty Mandali) - బర్కత్‌పురా చమన్ - టూరిస్ట్ హోటల్ - నింబోలిఅడ్డ - గోల్నాక - 6 నంబర్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

ప్రత్యామ్నాయ మార్గం - 2: ఫీవర్ ఆసుపత్రి - తిలక్ నగర్ ఎడమవైపు (Left) - ఎన్.సి.సి - ఫీవర్ ఆసుపత్రి - బర్కత్‌పురా చమన్ - టూరిస్ట్ హోటల్ - నింబోలి అడ్డ - గోల్నాక - 6 నంబర్ జంక్షన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.


3. ఇతర వాహనాల మళ్లింపు:

ఫీవర్ ఆసుపత్రి, ఎన్.సి.సి వైపు నుండి వచ్చే అన్ని రకాల వాహనాలను (భారీ వాహనాలు మినహా) తిలక్ నగర్ నుంచి బడా గణేష్ లేన్, బతుకమ్మ కుంట రోడ్డు వైపునకు మళ్లించడం జరుగుతుంది. ఈ మార్గాన్ని ఖచ్చితంగా 'వన్-వే' గా  అమలు చేయనున్నారు.

ఈ క్రమంలో.. ప్రయాణికులు , వాహనదారులు పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలలో తమ గమ్యస్థానాలకు చేరుకొవాలని హైదరాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో సూచించారు.  అదే విధంగా ఏదైన అత్యవసర సహాయం అవసరమైతే, దయచేసి మా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలని సూచించారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Telugu News