Raja Singh Says Every hindu take up gun for Self Defence:ఆత్మరక్షణ కోసం ప్రతి హిందువు లైసెన్స్‌డ్ తుపాకీ కొనుగోలు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హిందువులకు భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ప్రతి హిందు బంధువుకు సూచించారు.
సోషల్ మీడియాలో రాజా సింగ్ వీడియో వైరల్..
ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం జనాభా పెరిగితే భవిష్యత్తులో భారతదేశంలో హిందువుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో హిందువుల భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
భవిష్యత్తులో ముస్లిమ్స్ నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది..
అందుకే ప్రతి హిందువు ఆత్మరక్షణకు సంబంధించిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తమ రక్షణ కోసం చట్టబద్ధమైన అనుమతులు తీసుకుని లైసెన్స్‌డ్ తుపాకులను కొనుగోలు చేయాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంత మంది ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు చట్టసభ సభ్యుడై ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని ప్రశ్నిస్తున్నారు.