Rtc bus driver rude behavior mgbs bus station Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అందిస్తుంది. మహిళల నుంచి కూడా ఈ పథకంను మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఫ్రీబస్సులో సీటు కోసం మహిళలు గొడవలు పడుతున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు అని కూడా చూడకుండా కొద్ది మంచి ప్రయాణికులు బూతులు తిట్టుకుంటూ దాడులు చేస్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ సైతం ఇలాంటి ఘటనలపై సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ బస్సు కండక్టర్, డ్రైవర్ లు సైతం ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో ఒక డ్రైవర్ ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు.ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
గర్భిణీ భార్య కోసం జాగ్రత్తగా నడపమన్న భర్త... ‘నువ్వు నడుపుకో’ అని డ్రైవర్ దురుసు ప్రవర్తన హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వద్ద ఘటన తన భార్య 5 నెలల గర్భంతో ఉందని, బస్సుని జాగ్రత్తగా నడపాలని.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ని కోరిన ఓ వ్యక్తి భరోసా ఇవ్వాల్సిన డ్రైవర్.. అందుకు భిన్నంగా ఆగ్రహంతో ఊగిపోయి అసభ్య పదజాలంతో దూషణలు ‘ఏం చేస్తావ్, నీ పెళ్లాం గర్భవతి అయితే నువ్వే బస్సు నడుపుకోపో’ అంటూ బస్సు డ్రైవర్ దురుసు ప్రవర్తన సోషల్ మీడియాలో వీడియో వైరల్.. బస్సు డ్రైవర్ తీరుపై విమర్శలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 18, 2026
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ప్రెగ్నెంట్ తో ఉన్నతన భార్యను బస్సు ఎక్కించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో కాస్త స్పీడ్ బ్రేకర్ల వద్ద నెమ్మదిగా తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో డ్రైవర్ ఆవేశంలో ఊగిపోయాడు. నీ పెళ్లాం కడుపుతో ఉంటే మాకేంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే వెళ్లి తొలుకో లేదా సపరేట్ గా బస్సు పెట్టుకొ అంటూ బస్టాండ్ లో రెచ్చిపోయాడు.
పాపం ప్రయాణికురాలి భర్త తాను కూల్ గా చెప్పిన కూడా బస్సు డ్రైవర్ కావాలని రాద్దాంతం చేస్తున్న కూడా సముదాయించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ డ్రైవర్ మాత్రం వెనక్కు తగ్గలేదు.దీంతొ కొంచెం సేపు ఎంజీబీఎస్ లో గందరగోళం తలెత్తింది. కొంత మంది ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ మరీ అంతగా అనుచితంగా ప్రవర్తించాల్సి అవసరం ఏముందని, అతనిపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.