Shed collapsed tragedy in yadagirigutta Temple: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపై పెను విషాదం చోటు చేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేకంగా భక్తుల కోసం ఐరన్ షెడ్డూల్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దశమి నేపథ్యంలో యాదాద్రికి భారీగా భక్తులు తరలివచ్చారు. భారీగా ఈదురు గాలులు రావడంతో ఐరన్ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలీపోయింది. దీంతో క్యూలైన్ లో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో కొండపై ఒక్కసారిగా గందరగోళ వాతావరణం తలెత్తింది.
⛺ కార్తీక ఉత్సవాల ఏర్పాట్ల వేళ కూలిన టెంట్.. 10 మంది భక్తులకు గాయాలు 📝 యాదగిరిగుట్టలో కార్తీకోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తుండగా వైట్ పండల్ టెంట్ ఒక్కసారిగా కుప్పకూలింది. 📝 ఈ ప్రమాదంలో పది మంది భక్తులు గాయపడ్డారు. 📝 గాయపడినవారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. #Yadagirigutta #Telangana
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 19, 2026
పది మంది భక్తులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ లను కు సమాచారం అందించారు. గాయపడ్డ భక్తులకు సపర్యలు చేశారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనలో యాదాద్రి దర్శనాలకు వచ్చిన వారంతా భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులు తమ వారికి గాయాలు కావడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.