• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /RTC Special Buses: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏమిటంటే?

RTC Special Buses: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏమిటంటే?

Telangana RTC Announces 7000 Special Buses For Dussehra 2026 And Special Fares: దసరా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త ప్రకటించింది. దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు.. ఈ పండుగకు ప్రత్యేకంగా 7 బస్సులను వేసినట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. దసరా సందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 16, 2026, 08:26 PM IST|Updated: Oct 16, 2026, 08:32 PM IST
joinshare
RTC Special Buses: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏమిటంటే?
Image Credit: Telangana RTC

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ‘డెస్టినీ’తో లైఫ్‌ రూట్ మారిపోతుందా..?

హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ‘డెస్టినీ’తో లైఫ్‌ రూట్ మారిపోతుందా..?

2

Revanth Reddy EMI CM: రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి.. ఈఎంఐలు కట్టకపోతే పదవి పోతుంది: కేటీఆర్

3

RTC Special Buses: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏమిటంటే?

4

Kwala Intel AI: 'క్వాలా ఇంటెక్‌ ఏఐ'తో స్టాక్‌ మార్కెట్‌ నుంచి సులభంగా లాభాలు.. ఎలా అడగాలో తెలుసా?

5

కేసీఆర్‌పై అప్పుడలా.. ఇప్పుడిలా.. జీవన్‌రెడ్డి రాజకీయ వైఖరిపై మంత్రి అడ్లూరి ఫైర్‌!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

RTC Dussehra Special Buses: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ దసరాను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. ఏపీ, తెలంగాణ ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగించుకుని పండుగ మరింత ఆనందంగా.. సురక్షితంగా చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. దసరాకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు వేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.

దసరా పండుగ ఏర్పాట్లు హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్‌)ను శుక్రవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్. వెంకన్న, శ్రీధర్‌తో కలిసి ఎండీ నాగిరెడ్డి జేబీఎస్‌లో పర్యటించి ఏర్పాట్లు చూసి.. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జేబీఎస్‌లో ప్రత్యేక విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్ ఆర్ఎం సుచరిత, కరీంనగర్ ఆర్ఎం రాజుతో బస్సుల నిర్వహణ, ట్రాఫిక్ కు సంబంధించి ఎండీ నాగిరెడ్డి సమీక్ష చేశారు. గంటకు పైగా బస్ స్టేషన్‌లో పర్యటించిన ఆయన ప్రయాణికులతో మాట్లాడి ఏర్పాట్లు, సౌకర్యాలు, మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు.

దసరా పండుగను పురస్కరించుకుని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 95 శాతం బస్సులను విజయవంతంగా నడిపినట్లు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత ప్రయాణికుల రద్దీ ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.

ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపాలని అధికారులను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. దసరా ప్రత్యేక బస్సుల నిర్వహణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పండుగ ముగిసిన అనంతరం తిరిగి ప్రయాణాలు చేసే ప్రయాణికుల కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేయాలని ఎండీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ​బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికులు బస్సు రిజర్వేషన్లను అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లను సంప్రదించవచ్చని వెల్లడించారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకుని ప్రయాణికులు సురక్షితంగా, ప్రశాంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Telugu News
Trending News