Destiny Movie First Look: ఎంతోమంది ప్రతిభావంతులకు టాలీవుడ్లో బలమైన పునాది వేసింది. వేణు ఎల్దండి ‘బలగం’తో అగ్ర దర్శకుడిగా మారగా.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వెండితెరపై హీరోలుగా, కీలక నటులుగా తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే వేదిక అందించిన మరో అద్భుత ప్రతిభావంతుడు, తనదైన సహజమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఇమ్మాన్యుయేల్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం ‘డెస్టినీ’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేయడంతో సోషల్ మీడియాలో సినీ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
బుల్లితెరపై పాపులర్ కామెడీ షో జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలామంది వెండితెరకు పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి వారు హీరోలుగా, కమెడియన్లుగా సత్తాచాటుతున్నారు. ఈ షో నుంచి వచ్చిన వేణు టిల్లు 'బలగం' సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో సత్తా చాటరు. అదిరే అభి కూడా డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఇప్పుడు అదే బాటలో తనదైన హాస్యంతో, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డెస్టినీ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేశారు. చిత్రబృందానికి బెస్ట్ విషెస్ అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్.
ఇమ్మాన్యుయేల్.. పక్కనే ఉన్న కానిస్టేబుల్.. వారి వెనుక చిక్కటి అడవి బాట.. బ్యాక్‌గ్రౌండ్‌లో సంకెళ్లు చూపించారు. ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇదొక థ్రిల్లింగ్ జర్నీగా సాగే రోడ్ మూవీ అని తెలుస్తోంది. టైటిల్ లోగోలో కూడా వీరిద్దరి పాత్రలనే హైలైట్ చేయడంతో ఈ ఇద్దరి ప్రయాణంతో ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా ఏదో చెప్పబోతోన్నారని అర్థమవుతోంది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన టీజర్, విడుదల తేదీ వంటి వివరాలను నిర్మాతలు వెల్లడించనున్నారు. ఈ సినిమాకు మారుతి రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా, డి.వెంకట ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సాంకేతిక బృందం: