• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Mahesh kumar Goud: కొండా సురేఖ విషయంలో అదే చేశాం.. రాజగోపాల్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.!.

Mahesh kumar Goud: కొండా సురేఖ విషయంలో అదే చేశాం.. రాజగోపాల్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.!.

Rajagopal reddy and anirudh reddy row: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వివాదాలపై మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ తగిన సమయంలో చర్యలు తీసుకుంటుందన్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 21, 2026, 17:22 IST|Updated: Nov 21, 2026, 17:33 IST
joinshare
Mahesh kumar Goud: కొండా సురేఖ విషయంలో అదే చేశాం..  రాజగోపాల్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు.!.
Image Credit: maheshkumargoud(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mahesh kumar goud fires on Rajagopal reddy and Anirudh reddy row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మణుగురు ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిల వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని, సొంత పార్టీ ప్రభుత్వంను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడంతో తెలంగాణలో తీవ్ర చర్చనీయాంగా మారింది. ఇప్పటికే  రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 

దీనిపై చర్యలు తీసుకొవాలని టీపీసీసీ కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో గుర్రుగా ఉన్నారు. అపోసిషన్ పార్టీ నేతల కన్నా కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంను విమర్శిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో మరోసారి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు.


కాంగ్రెస్ పార్టీలో కొంచెం అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైందన్నారు. పార్టీ లైన్‌ దాటి మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యల గురించి ఏఐసీసీ చూసుకుంటుందని తెల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ నిశితంగా పరిశీలిస్తోందని మాట్లాడారు. గతంలో కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ అనేకపర్యాయాలు వార్నింగ్ లు ఇచ్చి చివరగా  చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు అందరు నేతలు ఒకటేనని తెల్చి చెప్పారు. దేనికైన సమయంరావాలని పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు.

 మరోవైపు పార్టీలో ప్రతి ఒక్కరు నిబంధనల్ని పాటించాలని, లైన్ దాటితే ఆలస్యమైన చర్యలు ఖాయమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెల్చి చెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డి నిధుల జారీ, మంత్రిపదవిపై  సీఎం రేవంత్ ను ఎక్కడ చాన్స్ దొరికిన ఏకీపారేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం కొంత మంది లంచాధికారులు ప్రజల్ని వేధిస్తున్నారని అన్నారు. నియోజక వర్గాలకు నిధులు కూడా కేటాయించడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఈ ఇద్దరి అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో అని తెలంగణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News