SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mahesh Kumar Goud: రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం... టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్..

Rajagopal reddy and anirudh reddy row: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

Written By Inamdar Paresh
Published: Nov 19, 2026, 14:57 IST | Updated: Nov 19, 2026, 15:12 IST
Image Credit: pcc chief mahesh kumar goud (file)
Join

Mahesh kumar goud serious on mlas Rajagopal reddy and Anirudh Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తు వార్తలలో  ఉంటున్నారు. సొంత పార్టీ ప్రభుత్వంను, సీఎం రేవంత్ టార్గెట్ గా చేసుకుని విమర్శించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేసింది. మునుగొడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజక వర్గంకు నిధుల కేటాయింపుపై తరచుగా సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మరీ మోసంచేశారంటూ ఫైర్ అయ్యారు.  ఎక్కడ చాన్స్ దొరికిన కూడా విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు.ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భాష, ఆయన ఏదో లక్ ఉండి సీఎం అయ్యారని రాజగోపాల్ రెడ్డి ఏకీపారేశారు. నిధులు ఇవ్వమంటే పండపెట్టి తొక్కుతా అనిమాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు. 

ఈ మూడెళ్లలో ప్రజలు ఎక్కడ  సంతోషంగా లేరన్నారు. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం కాంట్రక్టర్ లకు పెండింగ్ నిధుల అంశంపై ఫైర్ అయ్యారు. తాను చనిపోతే అయిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నియోజక వర్గంకు నిధులు కేటాయిస్తుందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు తెలంగాణ ప్రభుత్వంలో లంచగొండి అధికారులు ఉన్నారని, ప్రతిచిన్న పనికి లంచాలు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్యనీయాంశంగా మారాయి. సొంత పార్టీకి చెందిన నేతలు ఇలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. దీనిపై తాజాగా.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా స్పందించారు. క్రమశిక్షణ ముందు అందరూ ఒక్కటేనని తెల్చి చెప్పారు.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. క్రమశిక్షణ ముందు అందరూ ఒక్కటేనంటూ తెల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం నిశితంగ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు అనిరుధ్ రెడ్డి మాట్లాడిన మాటలన్నింటినీ చూస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ విషయంలో ఎవరైనా ఒకటేనని స్పష్టం చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి,అనిరుధ్ రెడ్డి అంశంల కాంగ్రెస్ అధిష్టానంఏవిధంగా రియాక్ట్ అవుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES