• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!

గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!

Hyderabad: హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ (కర్నూల్‌) ఫ్రాటర్నిటీ వార్షిక సమావేశం-2026 ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి.. కళాశాలకు చెందిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.5 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతిని అందించి సత్కరించారు.

Written ByAshok Krindinti
Published: Oct 05, 2026, 01:54 PM IST|Updated: Oct 05, 2026, 01:56 PM IST
joinshare
గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!
Image Credit: SJGC Fraternity Annual Meeting 2026

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

2

Gold Vs Personal Loan: డబ్బు అవసరం ఉందా? గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్.. మీ అవసరాలకు ఏది సరైన ఎంపిక?

3

Delhi: క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

4

మంచితనానికి ప్రచారం అవసరమా?.. అందరూ హేళన చేసినా.. అడవి మొత్తాన్ని కాపాడిన నక్క కథ!

5

Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad: కర్నూల్‌లోని ప్రముఖ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ (SJGC) ఫ్రాటర్నిటీ వార్షిక సమావేశం-2026 హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు పూర్వ విద్యార్థులు, ఫ్రాటర్నిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కళాశాల విశిష్ట వారసత్వాన్ని, సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన ఐదుగురు అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మకుట డెవలపర్స్’ వ్యవస్థాపకులు, చైర్మన్ జనార్ధన్ కొంపల్లి విద్యార్థులకు మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఎంపికైన ఐదుగురు ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక నగదును అందించారు.

ఈ సందర్భంగా జనార్ధన్ కొంపల్లి మాట్లాడుతూ.. ఎంతోమంది విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను తీర్చిదిద్దడంలో SJGC కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రతిభావంతులను గుర్తించడం ద్వారా విద్యాసంస్థ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా.. భావి తరాలు ఉన్నత స్థానాలకు ఎదిగి మళ్లీ తమను తీర్చిదిద్దిన సమాజానికి, విద్యాసంస్థకు తిరిగి తోడ్పడేలా స్ఫూర్తిని నింపవచ్చని అన్నారు.

“SJGC ఎంతోమంది విద్యార్థుల ప్రయాణంలో భాగమైంది. వారు తమ తమ రంగాల్లో గొప్ప విజయాలు సాధించేందుకు దోహదపడింది. వారి విజయాలను గుర్తించడం ద్వారా ఆ వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడంతో పాటు.. తదుపరి తరం మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, తమను తీర్చిదిద్దిన విద్యాసంస్థలకు తిరిగి సహకరించేలా ప్రోత్సహించవచ్చు..” అని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకుని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కళాశాలతో తమకున్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News
Telangana News