• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి సేవలో ప్రముఖులు.. తొలి రోజు లక్షకు పైగా భక్తులు దర్శనం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి సేవలో ప్రముఖులు.. తొలి రోజు లక్షకు పైగా భక్తులు దర్శనం

VVIPs Darshan To Khairatabad Ganesh: దేశంలో విశేష గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. తొలి రోజు పూజలందుకున్న అనంతరం ఖైరతాబాద్‌ గణేశ్‌ భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. తొలి రోజు బడా గణేశ్‌ను చూసేందుకు ఎంత మంది వచ్చారో తెలుసా?

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 14, 2026, 11:38 PM IST|Updated: Sep 14, 2026, 11:49 PM IST
joinshare
Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి సేవలో ప్రముఖులు.. తొలి రోజు లక్షకు పైగా భక్తులు దర్శనం
Image Credit: VVIPs Darshan To Khairatabad Ganesh

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

2

AP DSC 2.o Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..అతిత్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్..మంత్రి లోకేష్ కీలక మార్పులు!

3

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

4

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

5

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ganesh Chaturthi 2026: వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఊరు వాడా గణనాథుల పాటలతో.. నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇక దేశంలోనే విశేష గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. 72 ఏళ్ల ఘనమైన చరిత్ర, ప్రస్థానం ఉన్న ఖైరతాబాద్ బడా గణపతి సోమవారం తొలి పూజలు అందుకుంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. తొలి పూజలు అందుకున్న అనంతరం బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఒక్క రోజే లక్ష మందికి పైగా భక్తులు వచ్చారని తెలుస్తోంది. ఇక పలువురు ప్రముఖులు కూడా ఖైరతాబాద్‌ గణేశ్‌ను సందర్శించారు.

ఖైరతాబాద్ మహా గణపతి వద్దకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖైరతాబాద్ మహా గణపతి విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యం, ప్రతి సంవత్సరం నిర్వహించే గణేష్ ఉత్సవాల ప్రత్యేకతలను మంత్రి పొన్నం ప్రభాకర్ గవర్నర్ దంపతులకు వివరించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి కలగాలని గవర్నర్‌ దంపతులు ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గవర్నర్‌ వెంట రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

72 ఏళ్ల ఘనమైన చరిత్ర, ప్రస్థానం ఉన్న ఖైరతాబాద్ బడా గణపతి సోమవారం తొలి పూజలు అందుకుంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఏర్పాట్లు పకడ్బందీ
ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఉత్సవ నిర్వహణ కమిటీలతో ప్రభుత్వం రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీస్, దేవాదాయ, విద్యుత్, వాటర్ వర్క్స్, వైద్య, ట్రాఫిక్ తదితర శాఖలను సమన్వయం చేసి ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ... 'గణేష్ ఉత్సవాల సందర్భంగా మూడేళ్లుగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. బోనాల ఉత్సవాలను కూడా ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నాం' అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.

'ప్రస్తుత ప్రకృతి విపత్తులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నాం. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందించేలా జరగాలి. ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సక్రమంగా సాగేందుకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకు భక్తులు, మండపాల నిర్వాహకులు పూర్తిగా సహకరించాలి' అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా, ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులు, భక్తులను కోరుతున్నట్లు చెప్పారు. గణేష్ మహారాజ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఈటల రాజేందర్‌ ప్రత్యేక పూజలు
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహా గణపతి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 'తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం' అని తెలిపారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర సంప్రదాయం, భక్తి పరంపర భవిష్యత్ తరాలకు కూడా అందేలా కొనసాగాలని ఎంపీ ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన విలువలు, మానవ సంబంధాలు, విశ్వాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పల్లెలు సిరిసంపదలతో కళకళలాడాలని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించి, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఆర్మూరు ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source