• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

GVMC Elections Updates: జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌పై తమకు అనుమానాలున్నాయని.. వాటిని అధికారులు నివృత్తి చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హెచ్చరించారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఆకస్మికంగా పెరిగిన పోలింగ్ శాతాలు పెరిగాయని.. అభ్యర్దుల్లేకుండానే స్ట్రాంగ్ రూమ్‌లోకి బ్యాలెట్ బాక్సులు తీసుకువెళ్లారని అన్నారు.

Written ByAshok Krindinti
Published: Nov 02, 2026, 07:10 PM IST|Updated: Nov 02, 2026, 07:12 PM IST
joinshare
GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు
Image Credit: GVMC Elections Updates (Source: Facebook)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

2

Savings Plan: ప్రతినెలా ఎంత ఆదా చేయవచ్చు? క్వాలా ఇంటెల్‌తో సులభతరం

3

GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

4

Tirumala: ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్‌ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ..

5

Bigg Boss Neha Fathima: బిగ్‌బాస్‌లో లేడీ కంటెస్టెంట్ ప్రేమాయణం..ఏకంగా షో‌లోకి వచ్చేసిన తల్లీదండ్రులు..షాకింగ్ మూమెంట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

GVMC Elections Updates: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు పోలింగ్ శాతాల్ని మార్చారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సీసీ కెమెరాలు లేకుండా పోలింగ్ నిర్వహణ, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్ధులు లేకుండా స్ట్రాంగ్  రూమ్‌లో బ్యాలెట్ బాక్సులు పెట్టి సీల్ వేసేందుకు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయా ఘటనలపై ఎన్నికల అధికారులు వివరణ ఇవ్వాలని.. పోలింగ్ శాతాలపై సమగ్ర వివరాలు మేయర్ అభ్యర్ధికి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయపోరాటం చేసేందుకు సైతం సిద్దమని ఆయన ఇవాళ హెచ్చరించారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి పోలింగ్ శాతాల్లో గందరగోళంపై ఫిర్యాదు వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్ధి వరుదు కల్యాణితో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.

విశాఖ కార్పోరేషన్ ఎన్నికలను  స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ముందు నుంచి కోరుతున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశాయో రాష్ట్రమంతా చూసిందన్నారు. ఓటమి భయంతో పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భౌతిక దాడులకు ప్రయత్నించి విధ్వంసాలకు కూడా పాల్పడ్డారని.. ప్రశాంతమైన విశాఖ నగరంలో అలాంటి విష సంస్కృతిని తీసుకురావద్దని తాము సూచించామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతీ పోలింగ్ స్టేషన్‌తో పాటు బయట, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు  చేయాల్సి ఉందన్నారు.

"ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినా అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం వరకూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి డమ్మీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిపై కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ రాతపూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోకుండా చివరి నిమిషంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం వల్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు. నిన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఎస్ఈసీ పోలింగ్ శాతాల్ని ప్రకటించింది.

విశాఖ కార్పోరేషన్లో 50.02 శాతం పోలింగ్ జరిగింది, ఇంకా సమాచారం రావాల్సి ఉందని సాయంత్రం చెప్పారు. నిన్న రాత్రి 10.47కు కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి 51.47 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. ఇందులో స్పష్టత లేదు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల రాత్రి 7.15 గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. ఈ ఉదయం జీవీఎంసీ కమిషనర్, ఐ అండ్ పీఆర్ వెబ్ సైట్ లో కూడా జీవీఎంసీ ఎన్నికల్లో 56.32 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. జోన్ల వారీగా కూడా ఇందులో వివరాలు ఇచ్చారు. రాత్రి 10.47కు ఇచ్చిన వివరాలకూ, ఉదయం ఇచ్చిన వివరాలకూ మధ్య సుమారు 5 శాతం ఓట్లు పెరిగాయి. అంటే 89124 ఓట్లు అదనంగా ఉన్నాయి." అని కేకే రాజు తెలిపారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులు పెట్టి పవర్ కట్ చేయాలని.. కానీ జీవీఎంసీ ఎన్నికల్లో మాత్రం ఏ స్ట్రాంగ్ రూమ్‌కు కూడా రాత్రి 1.10 నిమిషాల వరకూ సీల్ చేయకుండా వదిలేశారని ఆయన ఆరోపించారు. తాము నిబంధనలు పాటించాలని గట్టిగా అడిగితే అప్పుడు సీల్ వేశారని అన్నారు. అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలింగ్‌కు సంబంధించి అధికారులు చేసిన ప్రకటనలపై స్పష్టత, సమగ్ర పోలింగ్ శాతం వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Visakhaptnam
YS Jagan Mohan Reddy
Politics
AP News