• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /వారంతా దేశద్రోహులే.. కరీంనగర్‌లో బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు!

వారంతా దేశద్రోహులే.. కరీంనగర్‌లో బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు!

Karimnagar: కరీంనగర్‌లో ఓ సమావేశంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేకమైన సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారంతా దేశద్రోహులని విమర్శించారు. అంతేకాకుండా ఆయన ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 13:47 IST|Updated: Nov 22, 2026, 13:49 IST
joinshare
వారంతా దేశద్రోహులే.. కరీంనగర్‌లో బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bandi Sanjay: కరీంనగర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఓటర్ల జాబితా సవరణ (SIR), మైనారిటీ సంక్షేమ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఓటర్ జాబితా సవరణ గురించి కూడా ఈ సందర్భంగా ఆయన ఎంతగానో మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రాష్ట్రంలోని బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి గా ఒకటయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు.. బిజెపిని రాజకీయంగా అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు ఉమ్మడి వ్యూహాలు రచిస్తున్నాయని ఆయన విమర్శించారు.. రాష్ట్ర ప్రజలు ఈ రెండు పార్టీల తీరును గమనిస్తున్నారని.. మార్పు కోసం బిజెపి వైపు చూస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు..

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారిపై కేంద్రమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. దేశ భద్రతకు, ప్రజాస్వామ్య పారదర్శకతకు కీలకమైన SIR ప్రక్రియను అడ్డుకునే వారంతా దేశద్రోహులని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించాలని కోరుకునేవారు మూర్ఖులని ఈ సమయంగా ఆయన మండిపడ్డారు.. నిజమైన భారతీయ పౌరులకే ఓటు హక్కు ఉండాలన్నది బిజెపి సిద్ధాంతమని.. అక్రమ ఓటర్ల ఏరువేతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..

కరీంనగర్ పర్యటనలో భాగంగా స్థానిక సిగ్గు సమాజం ప్రతినిధులతో మాట్లాడిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం సిక్కు సమాజాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన విమర్శించారు.. దేశ రక్షణలో.. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సిక్కు వర్గీయుల సమస్యలను పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిగ్గు సమాజాన్ని అన్ని విధాల ఆదుకుంటామని.. వారి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News