SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాలువల్లో నీళ్లు లేకుంటే విగ్రహాలు రోడ్లపైనే.. కాంగ్రెస్ సర్కార్‌కు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్

Bandi Sanjay Ganesh Immersion Warning: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువ లోకి, చెరువులోకి నీటిని విడుదల చేయాలని కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే ఎస్సారెస్పీలోకి కూడా నీళ్లను విడుదల చేయాలని అన్నారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 11:58 AM IST | Updated: Sep 20, 2026, 12:00 PM IST
Image Credit: కాలువల్లో నీళ్లు లేకుంటే విగ్రహాలు రోడ్లపైనే.. కాంగ్రెస్ సర్కార్‌కు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్
Join

Bandi Sanjay Ganesh Immersion Warning Telugu: తెలంగాణ రాష్ట్రంలో వినాయక నిమర్జనం ఏర్పాట్లపై నిర్లక్ష్యం వీడి.. తక్షణమే ఎస్సారెస్పీ సహా ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయాలని కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

తెలంగాణ వ్యాప్తంగా వినాయక నవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతున్నాయని.. అయితే నిమజ్జనం జరగాల్సిన కాలువలతో పాటు చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.. ఎస్సారెస్పీ పరిధిలోని కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని.. హిందూ పండుగల పట్ల ఆలసత్వం వహిస్తే అస్సలు ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి నీళ్లను వదల లేకపోతే భక్తులు వినాయక విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని... తద్వారా తలెత్తే శాంతి భద్రత ఎలా సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. పరిస్థితి చేయి దాటకముందే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్ష నిర్వహించి నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మీడియా సమావేశం లో కోరారు..

కాంగ్రెస్‌తో పాటు BRS పార్టీల మధ్య లోపాయి గారి ఒప్పందం నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కేటీఆర్ మంచి మిత్రులని.. అందుకే భూదోపిడి అంశాన్ని అడ్డం పెట్టుకొని కాలయాపన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. BRS హయాంలో లక్షల కోట్ల రూపాయల బూదోపిడి జరిగిందని చెప్పడానికి మూడేళ్లు పడుతుందా అని ప్రశ్నించారు.. ప్రభుత్వ సంకల్పం ఉంటే మూడు గంటల్లోనే సమగ్ర ఆధారాలు బయట పెట్టవచ్చని.. కానీ ఢిల్లీ అధిష్టానానికి ఈఎంఐలు చెల్లించేందుకు ఈ వ్యవహారాన్ని బేరాసారాలకు వాడుతున్నారని ఆరోపించారు..

సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు సంబంధిత పూర్తి ఆధారాలతో పాటు డాక్యుమెంట్లను బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచే బాధ్యత బిజెపి తీసుకుంటుందన్నారు.. ఆధారాలు లేకపోతే అసత్య ఆరోపణలు చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..

ఆరు గ్యారెంటీ లతో పాటు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి.. అసెంబ్లీని రాజకీయ గ్రామాలకు వేదికగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండేది ఇంకా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమేనని.. ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని.. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారులకు సహకరిస్తూ.. భక్తి శ్రద్దలతో నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు..

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES