• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు..

Dasara Festival Across Telugu States: దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 08:54 AM IST|Updated: Oct 12, 2026, 05:02 PM IST
joinshare
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు..
Image Credit: Dasara Festival (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Sachin Tendulkar: కూతురు సారా కోసం సచిన్ ఎమోషనల్ పోస్ట్.. తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ!

Sachin Tendulkar: కూతురు సారా కోసం సచిన్ ఎమోషనల్ పోస్ట్.. తనే నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ!

2

Old Rupee Scam: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉందా? ఒక్కో నోటుకు రూ.45 లక్షలు ఆఫర్..కట్‌చేస్తే..!

3

Sydney Sweeney Athlete Ad: యాడ్ కోసం దిగజారిపోయిన హాలీవుడ్ నటి.."నా లోదుస్తులు ఏ రంగో తెలుసా?" అంటూ కామెంట్!

4

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

5

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijaya Dashami Festival: ఇక ప్రముఖ జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో మొదటిరోజు  మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని పలురకాల పూలతో అలంకరించారు. బిల్వదళాలతో శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ.. సుగంధ ద్రవ్యాలు, ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.  శైలపుత్రి అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవిని, మల్లికార్జునస్వామిని బృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు.  సంప్రదాయ నృత్యం, నాట్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో విహారించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ అధికారుల, పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.రెండో రోజు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

బాసర పుణ్యక్షేత్రం..

బాసర పుణ్యక్షేత్రంలో  నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు.. బ్రహ్మచారిణీ దేవి అలంకారంలో భక్తులకు  దర్శనమిస్తున్నారు. వేకువ జామున 4 గంటలకు బాలాలయంలో అమ్మవారికి అభిషేకం, మహా హారతి నిర్వహించి, నైవేద్యం సమర్పించారు అర్చకులు. దేవి నవరాత్రి సందర్బంగా వస్తున్న భక్తులకు నాందేడ్ కు చెందిన జగదీశ్ మహారాజ్ గాడిపుర శిష్యుల ఆధ్వర్యంలో అన్నదానం కొనసాగుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్రహ్మచర్యానికి ప్రతీక అయిన బ్రహ్మచారిణీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల.. ప్రశాంతత, జ్ఞానం, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ధవళేశ్వరం..
రాజమండ్రి రూరల్‌ ధవళేశ్వరంలోని ఎర్రకొండ పెద్ద దుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 39వ నవరాత్రి వేడుకలను ఆలయ కమిటీ ఘనంగా ఏర్పాటు చేసింది. ప్రత్యేక అలంకారంలో అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. బాల త్రిపుర సుందరీ దేవికి 21 రకాల అఖండ హారతి ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిచ్చాు.

తిరుమలలో దసరా ఉత్సవాలు.. 
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.. శ్రీవారి ఆలయం ముందు టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.. స్వామివారి వివిధ రూపాలతో ఏర్పాటు చేసిన అలంకరణలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది.. తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
AP News
TTD News
Telangana News