• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

Zayn Marie Khan CJP Protest Injury: ముంబైలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ నటులు ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్, ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది గంటల కస్టడీ అనంతరం వాళ్లను విడుదల చేసినా.. జైన్ మేరీ తన శరీరంపై ఉన్న గాయాల గుర్తులను సోషల్ మీడియాలో చూపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Written ByHarish Darla
Published: Oct 12, 2026, 02:01 PM IST|Updated: Oct 12, 2026, 02:07 PM IST
joinshare
Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?
Image Credit: Source: Zee Telugu News

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

2

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

3

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

4

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

5

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zayn Marie Khan CJP Protest Injury: శనివారం ఉదయం ముంబైలో జరిగిన సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసులు జైన్ మేరీ, ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వ్యాన్ లోపలి నుంచి జైన్ ఒక ఫోటోను పంచుకోగా, అందులో ఇమ్రాన్ ఖాన్ చిరునవ్వుతో శాంతి చిహ్నాన్ని చూపిస్తూ కనిపించారు. ఆ ఫోటోకు "ఇంక్విలాబ్ జిందాబాద్" అని ఆమె రాశారు.

అంతేకాకుండా, వ్యాన్ లోపల జైన్ ఒక సరదా వీడియోను కూడా రికార్డ్ చేశారు. అందులో ఇమ్రాన్ ఖాన్‌ను 'ఎప్పుడైనా జైలుకు వెళ్లారా?' అని అడగ్గా, 'ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వెళ్లే అవకాశం కనిపిస్తోంది' అని ఇమ్రాన్ సరదాగా సమాధానమిచ్చారు.

గాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఆగ్రహం..
పోలీసుల కస్టడీ నుంచి విడుదలైన కొద్ది గంటలకే జైన్ మేరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో తన చేతులు, వేళ్లు, కాళ్లపై ఏర్పడిన గాయాల మచ్చలను కెమెరాకు చూపిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. "మాలోని భయం పోయేంత వరకు మమ్మల్ని ఇంకెంతగా భయపెట్టడానికి ప్రయత్నిస్తారు?" అని ఆమె పోలీసులను, అధికారులను ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

మరోవైపు నటి లేఖా వాషింగ్టన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పంచుకున్నారు. పోలీసులు తమను కార్లలో లేదా ఇతర వాహనాల్లో ఇంటికి వెళ్లనివ్వకుండా వీధుల్లో తిప్పుతున్నారని ఆమె మొదట ఆరోపించారు. అయితే, తదుపరి వీడియోలో తామందరం సురక్షితంగా ఉన్నామని, ఇళ్లకు బయలుదేరుతున్నామని ఆమె స్పష్టం చేశారు.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

నిరసన చేపట్టడానికి కారణం ఏమిటి? 
ఈ ఆందోళనా కార్యక్రమానికి సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నాయకత్వం వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని సీజేపీ ఆరోపించింది.

అర్హులైన అనేకమంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని, ఇది ఎన్నికల నిష్పక్షపాతాన్ని దెబ్బతీస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. పొరపాటున పేర్లు తొలగిస్తే ఉంటే అర్హులైన ఓటర్లు మళ్లీ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Movie