Kondagattu Anjanna: 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టంకు అంకురార్పణ.. అంజన్న నిజరూప దర్శనం కోసం భారీగా తరలివస్తున్న భక్తులు..
Sindoor removal rituals in kondagattu: కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా పొటెత్తారు. ఒకవైపు కార్తీక మాసం, మరోవైపు 60 ఏళ్ల తర్వాత సిందూరం తొలగించి స్వామివారి నిజరూపం దర్శన భాగ్యం కోసం వచ్చే భక్తుల కోసం ఆలయ సిబ్బంది సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
Huge devote rush in Kondagattu anjanna temple amid sindoor removal rituals: జగిత్యాల జిల్లాలో కొలువైన కొండగట్టు అంజన్న భక్తులకు కొంగు బంగారమని, పిలిస్తే పలికే దైవంగా భక్తులు కొలుచుకుంటారు. ఇక్కడ 40 రోజుల పాటు మండల దీక్షలో ఉంటే తమ కోరిక తప్పకుండా తీరుతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది వివాహాలు, సంతానం లేని వారు ఇక్కడ దీక్ష తీసుకుని ఉంటారు. ఈ క్రమంలో కొండగట్టు ఆలయంలో దాదాపు 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టంచోటు చేసుకొవడంతో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కొండగట్టు అంజన్న కొన్ని ఏళ్లుగా అలకరించిన సిందూరంను తొలగించి నిజరూపంలో స్వామివారి దర్శన భాగ్యంను భక్తులకు కల్పించనున్నారు. ఆలయ అధికారుల నిర్ణయం ప్రకారం నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించిన చందనాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈరోజు చందనాన్ని తొలగించే కార్యక్రమంచేపట్టారు.
దాదాపు 60 ఏళ్ల అనంతరం స్వామివారి మూలవిరాట్టును చందనపు అలంకరణ లేకుండా దర్శించుకునే అరుదైన అవకాశం భక్తులకు లభించింది. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు నిజరూపంలో అంజన్నను దర్శించుకునేందుకు భారీగా ఆలయంకు పొటెత్తారు. ఈ కార్యక్రమాన్ని పండితులు వేదమంత్రాల క్రతువుల మధ్య చందనోత్సవాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొండగట్టులో ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఆలయ పండితులు, అధికారుల నిర్ణయం ప్రకారం.. నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించిన చందనాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత నవంబర్ 21 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
సుమారు 40 రోజులపాటు కొనసాగే ఈ దర్శన మహోత్సవం కొండగట్టు చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది. ఆరు దశాబ్దాల తర్వాత లభిస్తున్న ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.అన్ని శాఖలక చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొవాలన్నారు. మరోవైపు ఇప్పటికే కార్తీక మాసంనేపథ్యంలో కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.