Karimnagar: కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అర్దరాత్రి ఇంట్లోకి దూరి కొండచిలువ హల్ చల్.. వీడియో వైరల్..
Python enters home in karimnagar: హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో అర్ధరాత్రి కొండ చిలువ హల్ చల్ చేసింది. కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా వంటగది నుంచి వింత శబ్దాలు విన్పించాయి. వెంటనే అక్కడకు వెళ్లిచూడగా భారీ కొండ చిలువ కదలికలు కన్పించాయి.
Huge Python Enters House at Midnight in Karimnagar: ఇటీవల పాములు, కొండ చిలువలు తరచుగా అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తాయి. బూట్లలో, చెట్ల పొదల్లో, చీకటిగా ఉండే ప్రదేశాల్లో పాములు ఎక్కువగా సంచారం చేస్తాయి. ఈ క్రమంలో పొరపాటున వాటి మీద కాళ్లు పెట్టడం వంటివి చేస్తే అవి కాటు వేస్తాయి. ఈ క్రమంలో కరీంనగర్ లోని హుజురాబాద్ లో భారీ కొండ చిలువ రాత్రంత ఒక ఇంట్లోకి వారికి చుక్కలు చూపించింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో అర్దరాత్రి భారీ కొండ చిలువ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటి గోడకు ఉన్న విండో నుంచి కొండ చిలువ కిచెన్ లోకి దూరింది. ఆ తర్వాత వింత వింత శబ్దాలు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా కొండ చిలువ కన్పించింది. వెంటనే వారంతా ఒక్కసారిగా షాక్ అయి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ టీమ్ అత్యంత చాకచక్యంతో కొండ చిలువను పట్టుకుని బంధించారు. కానీ అప్పటికే పలు మార్లు వారిపై కొండ చిలువ దాడికి ప్రయత్నించింది. ఎట్టకేలకు కొండ చిలువను బంధించడంతో ఇంట్లోని వారు ఊపిరిపీల్చుకున్నారు. కొండ చిలువను చూసేందుకు ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల వారు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.