SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కరీంనగర్‌లో సినిమా స్టైల్లో దోపిడీ.. రెండు SBI ATMలు టార్గెట్ చేసిన దొంగలు..

Karimnagar ATM robbery: కరీంనగర్ జిల్లాలో ఉదయం 3 గంటల సమయంలో ఓ దొంగల ముఠా హల్చల్ చేసింది. రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లను పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను దోచుకెళ్ళారు. ఈ సమయంలో దొంగలు ఎవరికి అనుమానం రాకుండా స్కార్పియో వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 11:49 AM IST | Updated: Sep 20, 2026, 11:51 AM IST
Image Credit: కరీంనగర్‌లో సినిమా స్టైల్లో దోపిడీ.. రెండు SBI ATMలు టార్గెట్ చేసిన దొంగలు..
Join

Karimnagar ATM robbery Telugu News: కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి వేళ అంతర్రాష్ట్ర ముఠా తరహాలో దొంగలు తీవ్ర కలకాలం సృష్టించారు.. పక్క రెక్కీ నిర్వహించి.. సినిమా ఫకీలో ఒకే రాత్రి రెండు వేరువేరు ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లను లక్ష్యంగా చేసుకొని.. భారీ దోపిడీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ATM మెషిన్స్‌ను ముక్కలు చేసి అందులో ఉన్న లక్షణాది రూపాయల నగదును దోచుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్లాన్ ప్రకారమే ఈ దొంగతనం జరిగిందని పోలీసు అధికారుల సైతం భావిస్తున్నారు. అయితే, ఈ దొంగతనానికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కరీంనగర్ రూరల్ పరిధిలోని దుర్శేడ్ గ్రామంలోని SBI ATM, అలాగే ఎల్ఎండీ (LMD) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తిమ్మాపూర్ స్టేజి సమీపంలో SBI ATMలో.. రెండు చోట్ల చోరీ జరిగింది. తెల్లవారి జామున సుమారు మూడు గంటల సమయంలో దొంగలు ఒక తెల్లటి స్కార్పియో వాహనంలో వచ్చినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. వారి ఈ సమయంలో ఎవరూ లేనిది చూసి లక్షల రూపాయలను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

దొంగల ముఠా ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఏటీఎంలోకి చొరబడగానే ఎవ్వరికి అనుమానం రాకుండా.. గుర్తు తెలియకుండా ఉండేందుకు ముందుగానే సీసీ కెమెరాలు పై నల్లటి స్ప్రే చల్లారు. అనంతరం బ్యాంక్ అలారం మోగకుండా.. దానికి సంబంధించిన కేబుల్ వైర్లను కూడా కత్తిరించారు.. ఆ వెంటనే వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో ఏటీఎం యంత్రాలను క్షణాల వ్యవధిలోనే కట్ చేసి.. క్యాష్ బాక్సుల్లోని నగదును ఎత్తుకెళ్లారు..

ఉదయం వేళ మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ATM సెంటర్ల షెటర్లు తెరిచి.. లోపల యంత్రాలు ధ్వంసమై ఉండడాన్ని గమనించారు.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలుస్తోంది.. అలాగే వెంటనే అక్కడికి క్లూస్ టీమ్‌తో పాటు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించాయి. రెండు ప్రాంతాల్లో చోరీ జరిగిన తీరు ఒకేలా ఉండడంతో.. ఒకే ముట ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.

ATM కేంద్రాల్లో అమర్చిన సీసీటీవీలను ధ్వంసం చేసినప్పటికీ.. ఆ మార్గంలోని ప్రధాన రహదారులతో పాటు టోల్ ప్లాజాల వద్ద ఉన్న నిఘా కెమెరాల పుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులు వాడిన స్కార్పియో వాహనం నంబర్ ఆధారంగా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకమైన నాకాబందీ నిర్వహించి ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దోపిడీలో ఎంత మొత్తంలో డబ్బులు చోరీకి గురైనవనే వివరాలను బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఇక పోలీస్ అధికారులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకమైన బృందాలుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది..

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES