• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /60 ఏళ్ల తర్వాత కొండగట్టులో అద్భుత ఘట్టం.. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం!

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో అద్భుత ఘట్టం.. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం!

Kondagattu: దాదాపు 60 ఏళ్ల తర్వాత కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చందనోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా భక్తులు భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకునే అవకాశాలు ఉండడంతో అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 10:25 AM IST|Updated: Nov 01, 2026, 10:27 AM IST
joinshare
60 ఏళ్ల తర్వాత కొండగట్టులో అద్భుత ఘట్టం.. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
చేపల పులుసులో బెండకాయ.. అసలు రుచి వెనుక సీక్రెట్ ఇదే..!!

చేపల పులుసులో బెండకాయ.. అసలు రుచి వెనుక సీక్రెట్ ఇదే..!!

2

తెలుగు తెరపై ‘కొరివి’ దెయ్యం కథ.. టైటిల్ పోస్టర్‌తో సినిమాపై పెరిగిన అంచనాలు..

3

EPFO Whatsapp Service: ఉద్యోగులకు శుభవార్త..ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు, పాత ఖాతాలకు ఆటో సెటిల్‌మెంట్!

4

Raptadu Girl Incident: రంపం దాడి ఘటనతో షాక్‌లో స్కూల్ విద్యార్థులు.. మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం..

5

Raptadu Incident Update: రాప్తాడు పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో దాడి..నిందితుడు విద్యార్థిని వరుసకు బాబాయ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kondagattu News: ఉత్తర తెలంగాణలో అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రమైన జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అతి త్వరలో ఒక అపూర్వ ఘట్టానికి వేదికగా కాబోతోంది.. గత 60 సంవత్సరాలుగా నోచుకోని పరమ పవిత్రమైన శ్రీ హనుమాన్ చందనోత్సవ మహోత్సవం ఈసారి అత్యంత ఘనంగా జరగబోతోంది. ఈ చారిత్రక వేడుకను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో భాగంగా ప్రత్యేకమైన సమీక్షను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. భక్తుల సౌకర్యార్థం తీసుకోవలసిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు..

ఆలయానికి సంబంధించిన ఆగమ సాంప్రదాయాలు పాటిస్తూ నవంబర్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో చందనోత్సవ మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలతో పాటు హోమ క్రతువులు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పవిత్రమైన కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు దాదాపు 40 రోజులపాటు స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ఆరు శతాబ్దాల తర్వాత అంజన్నను ఈ రూపంలో దర్శించుకుంటే మహాభాగ్యం దక్కుతున్న అనడంతో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్రతో పాటు కర్ణాటక వంటి పరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్సవ సమయాల్లో రోజుకు దాదాపు 50 వేల మంది భక్తులు కొండగట్టు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్లపై వాహన రాకపోకలను సజావుగా నియంత్రించేందుకు ప్రత్యేకమైన ట్రాఫిక్ ప్లానింగ్ను సిద్ధం చేయాలని.. కొండగట్టుపై.. దిగువన అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని.. భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ద్వారా ప్రత్యేకమైన బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యంత్రాంగం చర్చించుకున్నట్లు తెలుస్తోంది..

అంతేకాకుండా క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు స్వచ్ఛమైన మంచినీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. కొండగట్టుపై 24 గంటలు వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేకమైన ఆరోగ్య కేంద్రాలతో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే పరిసరాల శుభ్రతకు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Karimnagar