SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

1000 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుతమైన మహదేవ ఆలయం జగిత్యాలలో ఎక్కడ ఉంది?

Historical Temples In Jagtial: 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కోరుట్ల పట్టణంలో కొలువైన మహదేవ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఆలయం కాకతీయుల తో పాటు జైనుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది అన్ని దేవాలయాల్లో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 03:07 PM IST | Updated: Sep 27, 2026, 03:09 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Historical Temples In Jagtial: తెలంగాణ నేల ప్రాచీన శిల్పకళా సౌందర్యానికి.. ఆధ్యాత్మిక అద్భుతానికి ఒక నిలయంగా భావించవచ్చు.. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో స్వయంభుగా వెలసిన శ్రీ మహాదేవ స్వామి ఆలయం ఒకటిగా చెప్పొచ్చు.. సుమారు 1000ల సుదీర్ఘ చరిత్రను సొంతం చేసుకున్న ఈ మహదేవ ఆలయం.. తరతరాల సాంస్కృతితో పాటు శిల్పకళా నైపుణ్యానికి అడ్డంపడుతూ.. భక్తులకు నమ్మకాన్ని నింపుతూ వస్తుంది.. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, తన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్థానిక చరిత్రకారులు అందించిన కథనాల ప్రకారం.. ఈ ఆలయాన్ని తొలత జైనుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు ఎంతగానో స్పష్టంగా చెబుతున్నాయి.. ఈ కాలంలోనే ఈ ఆలయ పునాదుల పడగా.. తర్వాత కాలంలో శిల్పాకల పోషకులైన.. కాకతీయ రాజుల పాలనలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందిందని ఆధారాలు కూడా ఉన్నాయి.. హిందూ.. జైన సాంస్కృతుల కలయికకు ప్రతీకగా నిలిచే ఈ ఆలయం.. నాటి పాలకులు చూపిన మతసామ్రస్యానికి ప్రతీకగా నిలుస్తూ వస్తోంది. ఇక్కడ కనిపించే శిల్ప శైలి భక్తులను.. చరిత్ర శోధనలు చేసే నిపుణులను విశేషంగా ఆకట్టుకుంటుంది..

ఈ ఆలయంలోని అంతర్భాగం అత్యంత అద్భుతమైన నిర్మాణ శైలిలో ఉంటుంది. గర్భాలయంలో ఇరువైపులా ఉన్న విశేషమైన గుణాలతో పాటు పురాతన నిర్మాణ కౌశలాన్ని ఎంతగానో ప్రతిబింబించేలా చేస్తాయి.. ఆలయ వెలుపలి గోడలపై అత్యంత సజీవంగా చెక్కిన క్షీరసాగర మథనం శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా దేవదానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవంగా చేసి.. సముద్రాన్ని చిలుకుతున్న దృశ్యాలు కూడా రాతిపై అప్పటి శిల్పులు ఎంతో అద్భుతంగా మలిచారు..

ఆలయ ప్రాంగణంలో.. గోడల సమీపంలో కొలువైన జైన తీర్థంకరుల విగ్రహాలు ఈ క్షేత్రం ప్రాచీన మూలాలను.. జైన సాంప్రదాయ చారిత్రక బంధాన్ని చాటి చెబుతూ ఉంటాయి.. కేవలం శివాలయం మాత్రమే కాకుండా.. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు కూడా కొలువై ఉండడం.. నిత్యం ఆలయాల్లో ఉన్న దేవతామూర్తులకు ఘనంగా పూజలు కొనసాగడం విశేషం.. ప్రాంగణంలో శ్రీ సుబ్రమణ్య స్వామి తో పాటు నాగేంద్ర స్వామి.. భక్త హనుమాన్ ఉపాలయాలు ఉన్నాయి. వీటితోపాటు ఆలయానికి మరింత పవిత్రతను అందించేందుకు ఒక చిన్న కోనేరు.. గోశాలను కూడా ఇక్కడ ఉన్నాయి..

పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రశాంతమైన పరిసరాలు నడుమ వెలిసిన ఈ వెయ్యిలనాటి మహాదేవ స్వామిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నిత్యం పూజలతో పాటు పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ పూర్వం వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రతిరోజు ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేకమైన పూజలు చేయడంతో.. ఇప్పుడు మళ్లీ ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యత పెరిగింది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES