SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jagtial: గుండు పిన్నుపై మట్టి గణపతి.. జగిత్యాల సూక్ష్మ కళాకారుడి మరో అద్భుతం.!.

Vinayaka chaturthi: ప్రతి ఏటా వినూత్న రీతిలో గణపతి విగ్రహాలను తయారు చేస్తుంటానని సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ తెలిపాడు.ఈ సారి వెరైటీగా గుండు పిన్నుపై మట్టి గణపతిని రూపొందిచినట్లు తెలిపాడు.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 14, 2026, 02:46 PM IST | Updated: Sep 14, 2026, 02:52 PM IST
Image Credit: Ganeshidolonpininjagtial
Join

Miniature artist made lord ganesha on a pin in jagtial: గణపతి నవరాత్రుల వేళ జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ తన ప్రత్యేక ప్రతిభతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతి ఏటా వినూత్న రీతిలో గణపతి విగ్రహాలను తయారు చేస్తుంటాడు. అయితే.. ఈసారి గుండు పిన్నుపై మట్టి గణపతిని రూపొందించారు. దీనిలో భాగంగా.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సందేశమిచ్చారు.

డాక్టర్ గుర్రం దయాకర్  రూపొందించిన గుండు పిన్నుపై మట్టి గణపతిచాలా అందంగా ఉంది. ఈ కళాకారుడు గౌరవ డాక్టరేట్ తోపాటు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లను సైతం సొంతం చేసుకున్నాడు. 
ఈ సూక్ష్మ గణపతి తయారీకి సుమారు 10 గంటల సమయం పట్టిందని తెలిపాడు. గుండు పిన్ను, మట్టి, వాటర్ కలర్స్‌ను ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో ఈ కళాకృతిని తీర్చిదిద్దినట్లు తెలిపాడు.

మట్టి గణపతిని తయారు చేయడం వెనుక పర్యావరణ పరిరక్షణే ప్రధాన ఉద్దేశమని దయాకర్ తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం, భూమి కాలుష్యం జరగకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు.

ముఖ్యంగా.. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా, పర్యావరణహితంగా జీవించాలంటే మట్టి గణపతులనే ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. చిన్న గుండు పిన్నుపై భారీ సందేశాన్ని ఆవిష్కరించిన డాక్టర్ గుర్రం దయాకర్.. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES