SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పెద్దపెల్లి జిల్లాలో 15 మంది వరుస మరణాలతో గ్రామంలో భయం.. ఇళ్లకు తాళాలు వేసి ఊరు ఖాళీ చేసిన జనం!

Peddapalli Viral News: ఊరికి ఏదో కీడు పట్టిందని.. దీని కారణంగా ఆ గ్రామంలో వరసగా మరణాలు జరుగుతున్నాయని పెద్దపెల్లి జిల్లాలోని ఓ గ్రామస్తులు ఊరి బయట సామూహిక వనభోజన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఒకరోజు ముందే ఇళ్లకు తాళాలు వేసి.. ఊరంతా ఖాళీ చేశారట. అయితే, ఈ ఘటన ఇక్కడ జరిగిందో? దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోండి..

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 06:06 PM IST | Updated: Oct 08, 2026, 06:07 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Peddapalli Viral Telugu News: మానవుడు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఆధునిక యుగంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి.. తమ గ్రామానికి ఏదో తీవ్రమైన కీడు సోకిందని.. దాని ఫలితం గానే వరస మరణాలు సంభవిస్తున్నాయని భావించిన గ్రామస్తులంతా ఒక్కటై ఊరు ఖాళీ చేసి.. పూరి బయటకు వెళ్లిన విచిత్ర ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? ఇంకా వారు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో కొద్ది రోజుల వ్యవధిలోనే సుమారు 15 మందికి పైగా వేరువేరు కారణాలతో మృతి చెందారట.. ఇలా ఒకరి వెంట ఒకరు వరుసగా మరణిస్తుండడంతో గ్రామ ప్రజల్లో ఊహించని భయాందోళనలు మొదలయ్యాయట.. ఇది సాధారణ మరణాలు కావని.. గ్రామంలో ఏదో దుష్టశక్తి ప్రభావం ఆవహించిందని గ్రామ పెద్దలతో పాటు ప్రజలు బలంగా నమ్మారు. ఈ అరిష్టాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలని ఆలోచనలతో పూర్వీకుల ఆచారాల వైపు మొగ్గు చూపారట..

గ్రామానికి పట్టిన కీడు తొలగి పోవాలంటే గ్రామస్తులంతా కలిసి ఒక రోజంతా ఊరు విడిచి బయట గడపాలని నిర్ణయానికి వచ్చారట.. ఇందులో భాగంగానే గ్రామస్తులంతా ఒకరోజు ముందే ప్లానింగ్ వేసుకొని.. తమ ఇళ్లకు తాళాలు వేశారట.. పిల్లాపాపలతో సహా గ్రామ పొలిమేరలు దాటి బయట ఉన్న వ్యవసాయ తోటలతో పాటు. అదే గ్రామంలో ఉన్న పండ్ల తోటలకు చేరుకున్నారట.. అక్కడ రోజంతా సామూహికంగా గడుపుతూ.. ప్రత్యేకంగా వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి వనభోజనాలు చేశారట.. ఇలా గ్రామ సరిహద్దులు దాటి బయట వనభోజనాలు చేయడం వల్ల గ్రామానికి పట్టిన చీడపీడలు తొలగిపోతాయని.. భవిష్యత్తులో అకాల మరణాలు ఆగిపోతాయని వారి విశ్వసిస్తున్నారట.

సైన్స్ తో పాటు టెక్నాలజీ ఎంతో వేగంగా పెరుగుతున్న సమయంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు పల్లెల్లో ఇలాంటి నమ్మకాలతో పాటు ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైద్యపరమైన లోపాలతో పాటు అనారోగ్య కారణాలు లేదా వయస్సు పై పడటం వల్ల మరణాలు జరిగినప్పటికీ.. వాటిని దుష్టశక్తుల ప్రభావముగా ముడిపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుందని కొంతమంది నిపుణులు అంటున్నారు. వరస మరణాల వెనుక గల అసలు కారణాలను విశ్లేషించుకోకుండా.. ఇలా ఊరు ఖాళీ చేయడం ప్రజల్లోని అవగాహన రాహిత్యమని వారు చెబుతూ వస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES