SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రష్యాలో ఉద్యోగం అంటూ మోసం.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధానికి తెలంగాణ యువకులు!

Telangana Youth Trapped In Russia: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ఏజెంట్‌ 10 మంది యువకులను మోసం చేశాడు.. రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. అక్కడి పంపించి.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఆర్మీలో చేర్చాడు. ఈ ఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వారికి స్వాదేశానికి తీసుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 01:45 PM IST | Updated: Oct 07, 2026, 01:47 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్.
Join

Telangana Youth Trapped In Russia: సొంత ఊరిలో సరైన ఉపాధి లేక.. విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించి.. ఫ్యామిలినీ పోషించుకుందామనుకున్న ఓ తెలంగాణ యువకుడు మోసగాళ్ల వలలో చిక్కుకుపోయాడు.. కంపెనీలో ఉద్యోగం పేరుతో రష్యాకు తీసుకెళ్లి.. అక్కడ మిలటరీ యూనిఫాం వేసి.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధానికి నిలబెట్టిన దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందించిన ఓ యువకుడికి జరిగింది..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దుమ్మాటి కిషన్ అనే యువకుడు స్థానికంగా ఎలాంటి జీవనోపాధి లేకపోవడంతో.. విదేశాలకు వెళ్లాలనుకున్నాడు.. ఈ సమయంలో సిరిసిల్లకు చెందిన ట్రావెల్ ఏజెంట్ శ్రీనివాస్‌ను ఆశ్రయించిన్నట్లు తెలుస్తోంది.. రష్యాలోని ఓ కంపెనీలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. విజిట్ వీసాపై తీసుకెళ్లి,  అక్కడ జాబ్‌లో చేర్పించిన తర్వాతే తాను తిరిగి వస్తానని ఎంతగానో నమ్మించాడు. దీని ఏజెంట్‌ ఒక్కో యువకుడి నుంచి రూ.2.50 లక్షల చొప్పున వసూలు కూడా చేశాడు..

అయితే, కిషన్‌తో పాటు సుమారు 10 మంది యువకులు సదరు బ్రోకర్‌తో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.. అయితే, ఇక్కడే ఏజెంట్‌ ఓ నాటకం ఆడాడు.. విమానాశ్రయంలో తనకు అనుమతి లభించడం లేదని.. తానూ తర్వాతి విమానంలో వస్తానని చెప్పి వారిని మాత్రమే ఫ్లైట్ ఎక్కించి ఏజెంట్ అక్కడినుంచే ఇంటికి చేరుకున్నాడు..

రష్యా చేరుకున్న వెంటనే.. యువకులను అక్కడి అధికారులు ఓ గదిలో ఉంచి.. వైద్య పరీక్షలు చేశారట.. ఆ తర్వాత వారిలో కొందరికి రక్షణ దళాల యూనిఫాంలు వేసి... చేతుల్లో తుపాకులు పెట్టి ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారట.. తాము ఘోరంగా మోసపోయామని గ్రహించిన వారు.. తమకు యుద్ధం వద్దని.. స్వదేశానికి పంపాలని అధికారుల కాళ్లపై పడినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేకపోయారు. అయినప్పటికీ.. అధికారులు కనికరం చూపకుండా.. రష్యా తరఫున సరిహద్దుల్లో నిలబడి పోరాడాల్సిందేనని కఠినంగా ఆదేశించారట.. యువకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచేశారట..

అయితే, అక్కడున్న అధికారుల కళ్లుగప్పి.. అతికష్టం మీద ఓ ఫోన్ సంపాదించిన కిషన్.. స్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారట.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో తమను సైనికులుగా.. మార్చారని చెబుతూ బోరున ఏడ్చేశాడట.. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

కిషన్‌కు మూడేళ్ల కుమారుడు అకిర కూడా ఉన్నారట.. భార్య రక్షిత ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి కూడా... సరిహద్దుల్లో భర్తకు ఏమైనా జరిగితే తమ పరిస్థితి ఏంటని భార్య.. తన కొడుకును ఎలాగైనా సురక్షితంగా రప్పించాలని తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని.. కిషన్‌తో పాటు మోసపోయిన యువకులందరినీ క్షేమంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుకుంటున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES