Jagtial: నేనొస్త.. భయమేస్తుంది.. జగిత్యాల చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో తల్లిదండ్రుల్ని హత్తుకుని ఏడుస్తున్న పసివాడు.. వీడియో..
Three year old child in jagtial: తల్లిదండ్రులను చూడగానే బాలుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. నేనొస్త తీసుకెళ్లాలని ఏడ్వడం అందర్ని కలిచి వేసింది. జగిత్యాల శిశు సంక్షేమ శాఖ కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Three year old child cries for parents in jagtial: జగిత్యాల జిల్లాలో శ్రీనివాస్, సరిత అనే దంపతులు శిశు సంక్షేమ కేంద్రంకు వెళ్లగా మూడేళ్ల బాలుడు వీరిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను తీసుకెళ్లాలని, ఇక్కడ ఉండనని తల్లిదండ్రుల్ని గట్టిగా హత్తుకుని ఏడ్వడం అందర్ని కలిసి వేసింది. అయితే అధికారులు మాత్రం పిల్లాడ్ని తీసుకెళ్లడానికి అంగీకరించలేద. దీనివెనుక అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు. గత కొన్నేళ్ల క్రితం శ్రీనివాస్, సరితలు తమకు సంతానం లేకపొవడంతో బాలుడ్ని తమ సమీప బంధువుల నుంచి దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి బాలుడ్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అప్పటి నుంచే ఆ చిన్నారి బాలుడే తమ లోకంగా భావించి జీవిస్తున్నారు.అయితే ఇటీవల బాలుడిని దత్తత తీసుకొవడంతో చట్టబద్దంగా దత్తత తీసుకొలేదని కొంత మంది చైల్డ్ కేర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మూడేళ్ల బాలుడ్ని వచ్చి తీసుకెళ్లారు.
అప్పటి నుంచి మూడేళ్ల బాలుడు శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆధీనంలో ఉన్నాడు. దీనిపై మూడేళ్ల బాలుడి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు సైతం ఈ దంపతుల తరపు లాయర్ బాలుడ్నిదత్తత తీసుకున్నారని చేసిన వాదనలతో ఏకీభవించింది. చిన్నారి భవిష్యత్తు, మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 16వ తేదీన ఆ బాలుడ్ని మరల పెంచిన తల్లిదండ్రులకు అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రోజులు గడుస్తున్న కూడా
శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉద్దేషపూర్వకంగా బాలుడ్ని తమకు అప్పగించడంలేదని వాపోతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్న కూడా తమ కొడుకును అప్పగించక పోవడంపై తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు బాలుడు తల్లిదండ్రుల్ని చూసి తనను తీసుకెళ్లాలని, ఇక్కడ భయమేస్తుందని వారిని హత్తుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు అధికారుల తీరును విమర్శిస్తున్నారు.