• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే!

పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే!

Peddapalli News: విశ్వకర్మ జయంతి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్‌లో జయంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో పాటు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. విశ్వకర్మకి ప్రత్యేకమైన పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 17, 2026, 02:38 PM IST|Updated: Sep 17, 2026, 02:39 PM IST
joinshare
పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే!
Image Credit: పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Peddapalli News: సృష్టిలోని ప్రతీ నిర్మాణానికి.. కళా నైపుణ్యానికి మూలపురుషుడిగా భావించే విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంతో ఘనంగా జరిగాయి. పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా సాగాయి.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హాజరయ్యారు.. ఈ కార్యక్రమం ప్రారంభంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములతో పాటు DCP రాంరెడ్డిలతో కలిసి అతిథులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి.. జ్యోతి ప్రజ్వలన చేశారు.

వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ..  విశ్వకర్మల విశిష్టతను అందరికీ గుర్తుచేశారు.. ప్రాచీనకాలం నుంచీ నేటి ఆధునిక యుగం వరకు మానవ నాగరికతలో క్రియాశీలక పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. తమ అద్భుత నైపుణ్యంతో పాటు అద్భుతమైన ఆలోచనలు, నిరంతర శ్రమతో సమాజ నిర్మాణంలో విశ్వకర్మలు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదన్నారు.. చేతివృత్తులకు ప్రాణం పోస్తూ.. సంస్కృతిని కాపాడుతున్న శ్రమజీవులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శిల్పకళ, వాస్తుతో పాటు లోహతో పాటు కొయ్య సంబంధిత వివిధ వృత్తులలో విశ్వకర్మలు సమాజానికి అందించిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. పూర్వీకుల విశిష్ట నైపుణ్యాలతో పాటు వారి శ్రమ విలువను నేటి తరానికి చాటిచెప్పేందుకు ఈ తరహా అధికారిక వేడుకలు వారధిలా వినియోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై విశ్వకర్మ కుల సంఘాలతో పాటు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సాంప్రదాయ వృత్తులను నమ్ముకున్న శ్రామికుల సంక్షేమానికి.. వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరింతగా ఆర్థిక, సాంకేతిక చేయూతనందించాలని ఈ వేదికగా కోరారు.

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source