SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Warangal: వరంగల్‌లో పెను విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు..

Couple suicide in Warangal: ఇంట్లో వెళ్లిచూడగా ఇద్దరు భార్యభర్తలు విగత జీవుల్లా పడిపోయిఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 17, 2026, 18:47 IST | Updated: Nov 18, 2026, 11:19 IST
Image Credit: warangal couple suicide news
Join

Couple commits suicide in Warangal: సమాజంలో ఇటీవల ప్రతి చిన్న విషయాలకు కొంత మంది గొడవలు పడుతు సూసైడ్ లు చేసు కుంటున్నారు. ముఖ్యంగా భార్యభర్తలు పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా ఆత్మహత్యలు లేదా హత్యలు చేసుకుంటున్నారు. జీవితం అన్న తర్వార సమస్యలు వస్తుంటాయి. కానీ కొంత మంది మాత్రం ప్రతి సమస్యలను పెద్దది చేసుకుని చూస్తే జీవితం మీదవిరక్తితో దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని ఘటనల్లో ఉన్నదాంట్లో సంతోషంతో ఉండకుండా అప్పులు చేసి, అవి తీర్చలేక సూసైడ్ లుచేసుకుంటున్నారు.ఈ క్రమంలో వరంగల్ లో దంపతులు తీసుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

వరంగల్ జిల్లాలోని శంభునిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక సంజయ్ కుమార్ (60), శోభ (53) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపులను తాళలేక, జీవితం మీద విరక్తితో భార్యభర్తలు సూసైడ్ నోట్ రాసి మరీ దారుణం చేసుకున్నారు. ఇంట్లో వారు ఎంత సేపటికి బైటకు రాక పోవడంతో  చుట్టుపక్కల వారు వీరి  ఇంట్లో వెళ్లి చూశాడు.  అప్పుడు భార్యభర్తలతో పాటు, వారి పెంపుడు శునకం కూడా విగత జీవిగా మారిపోయి ఉంది. 

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఘటన ప్రదేశంలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో అప్పుడు బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా అప్పుల అక్రమ వడ్డీ వ్యాపారాలు, వేధింపుల్ని అడ్డుకొవాలని భార్యభర్తలు దానిలో తమ గొడును చెప్పుకొచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES