• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /'గురుకులాల్లో మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు.. 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం'

'గురుకులాల్లో మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు.. 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం'

Telangana Gurukulam Schools: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, పౌష్టికాహారం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

Written ByAshok Krindinti
Published: Sep 15, 2026, 06:22 PM IST|Updated: Sep 15, 2026, 06:24 PM IST
joinshare
'గురుకులాల్లో మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు.. 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం'
Image Credit: Telangana Gurukulam Schools

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Gurukulam Schools: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన పోషకాహారం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. మందమర్రిలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో షేర్ ది విజన్ ఫౌండేషన్ చైర్మన్ నారాయణ అందించిన స్కూల్ బ్యాగులను మంత్రి విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి.. వారిలో ఉన్న క్రమశిక్షణ, చదువుపై ఆసక్తి, ఉన్నత లక్ష్యాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

గురుకుల విద్యార్థులకు పోషకాహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గురుకులాల్లో మెస్ ఛార్జీలను 40 శాతం పెంచామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వసతి వంటి అన్ని రంగాల్లో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం, దాతలు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మందమర్రి గురుకుల పాఠశాల అభివృద్ధికి గతంలో డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైన అదనపు వసతుల కల్పనకు కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 2 వేలకుపైగా పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రస్తుత పాఠశాలల్లో ఒకదానికి సైనిక్ స్కూల్ తరహా సౌకర్యాలు కల్పించే అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వసతి తదితర సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను సోమనపల్లిలో  ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతిలో మెరిట్ సాధించే విద్యార్థులకు ఈ పాఠశాలలో మంచి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వమే విద్యా ఖర్చులను భరిస్తుందని చెప్పారు.

విద్యార్థులు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News