• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /Telangana Monkey Attacks: కోతుల దండయాత్ర.. భయాందోళనలో పల్లెలు, పట్నాలు..!

Telangana Monkey Attacks: కోతుల దండయాత్ర.. భయాందోళనలో పల్లెలు, పట్నాలు..!

Telangana Monkey Attacks: తెలంగాణలో మనుషులకు, కోతులకు మధ్య యుద్ధం ముదురుతోంది. ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు.. ఇప్పుడు పల్లెలు, పట్టణాలపై దండయాత్ర చేస్తున్నాయి. ఊళ్లపై పడి ప్రజల ప్రాణాలతో, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా, ఇళ్లపై దాడులు చేస్తూ కప్పులను సైతం పెకలించివేస్తున్నాయి. కొట్టేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి తెగబడుతున్నాయి. రైతులు పడుతున్న ప్రత్యక్ష నరకంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్.

Written ByAshok Krindinti
Published: Oct 07, 2026, 07:48 PM IST|Updated: Oct 07, 2026, 07:49 PM IST
joinshare
Telangana Monkey Attacks: కోతుల దండయాత్ర.. భయాందోళనలో పల్లెలు, పట్నాలు..!
Image Credit: Telangana Monkey

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
World End: నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందా.. వైరల్ అవుతున్న పాత రీసెర్చ్..

World End: నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందా.. వైరల్ అవుతున్న పాత రీసెర్చ్..

2

Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

3

Prabhas Fauzi: ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!

4

Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

5

Telangana Monkey Attacks: కోతుల దండయాత్ర.. భయాందోళనలో పల్లెలు, పట్నాలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Monkey Attacks: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ పల్లె చూసినా...ఏ పట్టణం చూసినా ఒకటే భయం! ఎటు చూసినా కోతుల మూకలే కనిపిస్తున్నాయి. ఒకటా రెండా.. వందలాదిగా గుంపులు గుంపులుగా ఊళ్లపై పడుతున్న కోతులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వీధుల్లో నడవాలన్నా, పిల్లలను బయటకు పంపాలన్నా జనం గజగజ వణికిపోతున్నారు. దీంతో గడప దాటి బయటకు రావాలంటే భయం.. పసిపిల్లలను బడికి పంపాలంటే వణుకు! వీధుల్లో నడిచే బాటసారుల చేతిలో ఏమైనా కనిపిస్తే చాలు.. రక్కేసి పట్టుకెళ్తున్నాయి.

కోతులతో ఎక్కువగా నష్టపోతోంది  రైతులు. రెక్కలముక్కలు చేసుకుని, వేలాది రూపాయలు అప్పు చేసి సాగు చేసిన పంటను కోతులు నిమిషాల్లో మట్టిపాలు చేస్తున్నాయి. పత్తి కాయలను తెంచేయడం, మిరప తోటలను పీకేయడం, మామిడి, బొప్పాయి, కూరగాయల తోటలను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. పంట కాపలా కోసం రాత్రింబవళ్లు పొలాల్లోనే పాగా వేసినా.. గుంపులుగా వచ్చే కోతులను తరిమికొట్టడం రైతుల వల్ల కావడం లేదు. పంట నష్టంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటూ రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది.

పంట పొలాలే కాదు...ఇళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇళ్ల కప్పులపై గుంపులుగా చేరి పెంకులను పగలగొడుతున్నాయి. రేకులను పీకేస్తూ రూఫ్‌ టాప్‌లను సర్వనాశనం చేస్తున్నాయి. కిటికీలు, తలుపులు కొద్దిగా తెరిచి ఉన్నా చాలు.. ఇంట్లోకి చొరబడి నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. బీభత్సం సృష్టించి ఇంట్లోని సామగ్రిని పాడుచేస్తున్నాయి.

ఒకప్పుడు మనుషులను చూస్తే పారిపోయే కోతులు.. ఇప్పుడు తిరగబడుతున్నాయి! తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తే వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగుతున్నాయి. పదునైన కోరలతో కరిచి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ముసలివారు, పసిపిల్లలే లక్ష్యంగా దాడులు చేస్తుండటంతో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రేబీస్ భయంతో వ్యాక్సిన్ల కోసం ఉరుకులు పరుకులు తీయాల్సిన దుస్థితి నెలకొంది.

కోతులను వదిలించుకునేందుకు పల్లెల్లో జనం చేయని ప్రయోగమంటూ లేదు. పెద్ద పెద్ద శబ్దాలు చేసే డిజెలు పెట్టడం, పులి గర్జనల సౌండ్లు ప్లే చేయడం, మనుషులే ఎలుగుబంటి వేషాలు వేసి తిరగడం వరకు రకరకాల కసరత్తులు చేస్తున్నారు. లక్షలు పోసి కోతుల పట్టుకునే వారిని తెప్పించినా.. కేవలం కొద్దిరోజులే ఉపశమనం లభిస్తోంది. మళ్లీ ఎక్కడికక్కడ కొత్త మూకలు ప్రత్యక్షమవుతూ గ్రామస్తుల సహనాన్ని పరీక్షకు గురిచేస్తున్నాయి.

ఈ స్థాయిలో కోతులు ఊళ్లపై పడటానికి ప్రధాన కారణం అడవులు నశించిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. అడవుల్లో వాటికి ఆహారం, నీరు లభించకపోవడం.. మానవ ప్రమేయంతో సహజసిద్ధమైన పండ్ల చెట్లు తగ్గిపోవడమే ఈ పరిస్థితికి దారితీసింది. దానికితోడు పర్యాటకులు, జనం రోడ్లపై ఇచ్చే జంక్ ఫుడ్‌‌కు అలవాటుపడిన కోతులు అడవులను వదిలి జనవాసాల బాట పట్టాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే ఈ ముప్పుకు మూలకారణంగా మారింది.

పరిస్థితి ఇంత భయానకంగా ఉన్నా.. ప్రభుత్వం, అధికారులు మాత్రం అరకొర చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అటవీశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కోతుల సంతానోత్పత్తిని అరికట్టేందుకు 'స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. శాశ్వత ప్రణాళికలు లేకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి.. మండల స్థాయిలో మంకీ రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. శాస్త్రీయ పద్ధతుల్లో కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టి, తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Warangal