• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /Train Cancelled Warangal: రైలు ప్రయాణికులకు అలర్ట్..రేపు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లు రద్దు..అక్కడ స్పెషల్ ట్రైన్స్!

Train Cancelled Warangal: రైలు ప్రయాణికులకు అలర్ట్..రేపు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లు రద్దు..అక్కడ స్పెషల్ ట్రైన్స్!

Train Cancelled Warangal: వినాయక చవితి, దసరా పండుగల నేపథ్యంలో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రైల్వే శాఖ కొన్ని స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు కొన్ని రైళ్లను పాక్షికంగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం అందుతోంది.

Written ByHarish Darla
Published: Sep 19, 2026, 12:18 PM IST|Updated: Sep 19, 2026, 12:22 PM IST
joinshare
Train Cancelled Warangal: రైలు ప్రయాణికులకు అలర్ట్..రేపు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లు రద్దు..అక్కడ స్పెషల్ ట్రైన్స్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Train Cancelled Warangal: వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కొన్ని కీలక రూట్లలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొత్తం మీద 8 స్పెషల్ ట్రైన్స్‌ను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమై అక్టోబరు 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాగ్ రాజ్, తిరునల్‌వెళ్లి మధ్య తిరిగే ట్రైన్ కొన్ని ప్రత్యేక స్టేషన్లలో మాత్రమే నిలుపుదల చేస్తారని సమాచారం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.

స్పెషల్ ట్రైన్ సర్వీసుల వివరాలు..
పండుగ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారం..
ప్రయాగ్రాజ్ - తిరునెవెళ్లి (రైలు నంబరు - 04171): ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 19వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మొత్తం నాలుగు సర్వీసులుగా వరంగల్ స్టేషన్‌కు చేరుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

తిరునెవెళ్లి - ప్రయాగ్రాజ్ (రైలు నంబరు 04172): తిరుగు ప్రయాణంలో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 21వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు నాలుగు సర్వీసులుగా వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.

హాల్టింగ్ (ఆగే) స్టేషన్ల వివరాలు..
ఈ ప్రత్యేక రైళ్లకు అప్, డౌన్ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ముఖ్యమైన స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో మాణిక్పూర్, సంత, కాట్ని, జబల్పూర్, ఇటార్సీ, నాగపూర్, చంద్రాపూర్, బల్లర్ష, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కట్పాడి, జోలార్‌పేటై, సేలెం, నమ్మకల్, కరూర్, దిండిగల్, మదురై, సత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెవెళ్లి.. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని, ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

పలు రైళ్లు రద్దు..
అలాగే నిత్యం దేశవ్యాప్తంగా ఢిల్లీ, చెన్నై మధ్య రైల్వే లైన్‌ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం పండుగల నేపథ్యంలో ఢిల్లీ - చెన్నై మధ్య సికింద్రాబాద్, విజయవాడ మీదుగా నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే శాఖ కొన్ని స్పెషల్ ట్రైన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే వరంగల్, కాజీపేట మీదుగా సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య ప్రయాణించే పలు రైళ్లను ఆపరేషన్ కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 20 వరకు కొన్ని రైళ్లను రద్దు చేసింది. అందులో సికింద్రాబాద్ - వరంగల్ (67761) పుష్ఫుల్ ఉండగా.. అలాగే వరంగల్ - సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే (12757) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 20వ తేదీన రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమించాలని రైల్వే శాఖ తెలిపింది.

Also Read: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇప్పుడు తిరుపతికి మరో వందే భారత్ రైలు

Also REad: School Holidays: ఈవారంలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు..విద్యార్థులకు పండగే పండగ


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source