• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /ఆ ఊరికి మా పిల్లను ఇవ్వం బాబోయ్.. బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న యువకులు

ఆ ఊరికి మా పిల్లను ఇవ్వం బాబోయ్.. బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న యువకులు

Warangal News: సమాజం ఆకాశానికి నిచ్చనవెస్తోంది. పాలకులు ప్రగతి ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. కానీ ఆ నేతల మాటలకు ఆమడ దూరంలో ఉందో పల్లెటూరు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. కనీసం నడవడానికి మట్టి రోడ్డు కూడా లేదు. ఈ రవాణా కష్టాలు ఆ ఊరి యువత చదువులకే కాదు.. జీవితాల్లో పెళ్లి భాజాలు మోగడానికి కూడా శాపంగా మారాయి. ముప్పై ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాక బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న దుస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం..

Written ByAshok Krindinti
Published: Sep 18, 2026, 02:25 PM IST|Updated: Sep 18, 2026, 02:26 PM IST
joinshare
ఆ ఊరికి మా పిల్లను ఇవ్వం బాబోయ్..  బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న యువకులు
Image Credit: Warangal News

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Warangal News: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామం. ఊరిలో వ్యవసాయం బాగుంది.. కష్టపడే తత్వం ఉంది.. అనుకున్నంత సంపాదన ఉంది. అంతా ఉన్నా.. ఊరికి రావడానికి సరైన రోడ్డు లేదు. ఇదే ఇప్పుడు పెళ్లి వయసొచ్చిన యువకులకు శాపంగా మారింది. "రోడ్డు లేని ఊరికి మా పిల్లను పంపలేం" అంటూ పక్క ఊరి వాళ్లు సంబంధాలు మాట్లాడటానికే వెనకాడుతున్నారు. ఊరి సరిహద్దుల్లోని బురద రోడ్డు చూడగానే పెళ్లికూతురు తరఫు వాళ్లు వెనుతిరుగుతున్నారు.

యువకులు చదువుకున్నా, ఉద్యోగాలు ఉన్నా.. ఒకే ఒక్క రోడ్డు సమస్య వందలాది కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగకుండా చేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఈ ఊరికి బయట ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అత్యవసరమైతే ఊరు దాటడమే నరకం. దీంతో ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లిళ్లు కాక, ఎంతో మంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఈ రోడ్డు కష్టాలు పిల్లల చదువులను కూడా దెబ్బతీస్తున్నాయి. కనీసం అక్షరాలు నేర్చుకోవడానికి ఈ గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాల కూడా లేదు. ఓనమాలు నేర్చుకోవడానికి  పిల్లలు పక్క ఊర్లకు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ప్రతి నెల రేషన్ బియ్యం కోసం కూడా 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని స్థానికులు కన్నీరు పెడుతున్నారు.

సరైన రోడ్డు, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కిలోమీటర్ల కొద్దీ బురదలో నడవలేక....మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ లేని ఈ దారుల్లో ఆడపిల్లలను పంపలేక, చదువు మాన్పించేస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన ప్రతిభావంతులైన యువతులు ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు.. తారు రోడ్లు వేస్తాం, బడి కట్టిస్తాం అంటూ రంగురంగుల హామీలు ఇస్తారు. కానీ గెలిచాక కన్నెత్తి కూడా చూడరు. గర్భిణీలకు ప్రసవ సమయం వచ్చినా.. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కూడా రాలేని నరకకూపంలో బతుకుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే రోడ్డు వేసి, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని లక్ష్మీపురం ప్రజలు వేడుకుంటున్నారు. ఇదీ లక్ష్మీపురం గ్రామ ప్రజల కన్నీటి వ్యధ. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి తమ గ్రామానికి రోడ్డువేయాలని కోరుతున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Warangal
Telugu News