SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తింటే ఇన్ని లాభాలా? ఈ 5 విషయాలు తెలిస్తే అస్సలు మిస్ చేయరు!

మొలకెత్తిన విత్తనాలు.. ఇవి ఆరోగ్యకరం.. పోషకాలు పుష్కలం. ప్రతిరోజూ మన డైట్‌లో చేర్చుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారు. లేదా స్నాక్‌ రూపంలో కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.

Written By Renuka Godugu
Published: Nov 20, 2026, 14:35 IST | Updated: Nov 20, 2026, 14:39 IST
Image Credit: Eating Sprouts Every Morning:
Join

Eating Sprouts Every Morning: స్ప్రౌట్స్‌.. వీటిని రుచికరంగా సిద్ధం చేసుకుని తీసుకోవచ్చు. పోషకాలు పుష్కలంగా లభించ ఈ మొలకెత్తిన విత్తనాలు తింటే రుచికరం.. ఆరోగ్యకరం. ఇది ఒక సమతుల ఆహారం. సాధారణంగా మొలకెత్తిన విత్తనాలు అంటే పెసర్లు, శనగపప్పు ఉంటాయి. వీటిని నానబెట్టి చాట్‌, స్నాక్‌ తయారు చేసుకోవచ్చు.

మొలకెత్తిన విత్తనాలు రోజూ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం..
మొలకెత్తిన విత్తనాల్లో ఖనిజాలు పుష్కలం..
మొలకెత్తిన విత్తనాల్లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్‌, ఫైబర్‌, విటమిన్స్‌, ఖనిజాలు కలిగి ఉంటాయి. ఈ ఖనిజాలు మనకు సమతుల ఆహారం అవుతుంది.

మొక్కల ఆధారిత ప్రోటీన్‌..
మనకు ప్రతిరోజూ ప్రోటీన్ అవసరం. ఈ మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటే కణజాలాలను రిపెయిర్‌ చేసే గుణం ఉంటుంది. మొలకెత్తిన విత్తనాల్లో ఉండే బీన్స్‌ మొక్కల ఆధారిత ప్రోటీన్‌. ఇందులో కూరగాయలు లేదా ఏదైనా హోమ్‌ మేడ్ ర్యాప్‌, పోహా, బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకోవచ్చు. స్ప్రౌట్స్‌లో మాత్రమే కాదు పాలు, పెరుగు, పనీర్‌, బీన్స్‌, పప్పులు, గింజలు, గుడ్లలో కూడా ప్రోటీన్‌ లభిస్తుంది.

డైటరీ ఫైబర్‌..
మన డైలీ రొటీన్‌లో ఫైబర్‌ చేర్చుకోవాలి. ఈ స్ప్రౌట్స్‌లో పుష్కలంగా లభిస్తాయి. చాలా వరకు ఈ మొలకెత్తిన విత్తనాల్లో ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ డైడ్‌లో చేర్చుకోకండి. కొద్ది మొత్తంలో ప్రారంభించి దాని మోతాదు పెంచుకుంటూ వెళ్లండి.

బ్రేక్‌ఫాస్ట్‌లో బాగుంటుంది..
ఈ మొలకెత్తిన విత్తనాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే మంచిది. దీంతో కీరదోస, టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర కూడా వేసి తీసుకోవాలి. ఇందులో పై నుంచి కాస్త నిమ్మరసం పిండుకుని, ధనియాల పొడి కూడా వేసి తీసుకోవాలి.

Read Also: బరువు తగ్గాలా? ఎముకలు ఉక్కులా మారాలా?.. రోజూ రాగులు తింటే కలిగే 5 ఆశ్చర్యకరమైన లాభాలు ఇవే!
 

మీరు ఉడికించిన ఈ మొలకెత్తిన విత్తనాలను పోహ లేదా ఉప్మాలా తయారు చేసుకుని తీసుకోవాలి. వీటిని పులావ్‌, వెజిటేబుల్స్‌తో కూడా తీసుకుంటారు. మీరు ఈ మొలకెత్తిన విత్తనాలను నానబెట్టి నేరుగా కూడా తినవచ్చు. వీటిని ప్రత్యేకంగా రిసిపీ తయార చేయాల్సిన పనిలేదు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES