SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రోజూ బ్లాక్ టీ తాగుతున్నారా? అయితే ఈ 5 అద్భుతమైన ప్రయోజనాలు మీ కోసమే!

ఈ మధ్యకాలంలో బ్లాక్ టీ వినియోగం, దాని ప్రాచుర్యం గణనీయంగా పెరిగింది. బ్లాక్ టీ తాగడం వల్ల మనకు అద్భుతమైన ఫ్లేవర్స్, ఆహ్లాదకరమైన అరోమా లభిస్తాయి. ఇది మన శరీరాన్ని వివిధ రకాల హానికర అంశాల బారిన పడకుండా కాపాడుతుంది. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి; ఇందులో గత ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన అనేక ఇతర ఆరోగ్య గుణాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి.

Written By Renuka Godugu
Published: Sep 14, 2026, 06:27 PM IST | Updated: Sep 14, 2026, 06:31 PM IST
Image Credit: Black Tea Benefits
Join

Black Tea Benefits: ప్రస్తుత కాలంలో చాలామంది బ్లాక్ టీని ఎంతో ఇష్టపడి తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో దీనిని భాగంగా చేసుకుంటున్నారు. బ్లాక్ టీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ శరీరంలోని రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షణ కల్పిస్తుంది. రెగ్యులర్ గా బ్లాక్ టీ తీసుకోవడం వల్ల కలిగే సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ బూస్ట్..
బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి. ఇందులోని శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తాయి, తద్వారా కణాల నష్టం జరగకుండా కాపాడతాయి. ఇది మనల్ని ప్రాణాంతకమైన వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా, బ్లాక్ టీలోని ఫ్లేవనాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

మెంటల్ ఫోకస్ మెరుగుదల..
బ్లాక్ టీ తీసుకోవడం వల్ల అందులోని కెఫైన్ ప్రభావంతో మెంటల్ ఫోకస్, ఏకాగ్రత మెరుగుపడతాయి. ఇందులో ఉండే కొన్ని రకాల యాసిడ్స్ మెదడు అభివృద్ధికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే గుణాలను కలిగి ఉంటాయి. వివిధ రకాల పరిశోధనల ప్రకారం, బ్లాక్ టీని క్రమం తప్పకుండా తీసుకునే వారిలో మానసిక ఏకాగ్రత మరియు మెంటల్ ఫోకస్ గణనీయంగా పెరిగినట్లు తేలింది.

గుండె ఆరోగ్యం..
బ్లాక్ టీ తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యం చాలా సమర్థవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ వల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా, రక్తపోటు వంటి సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా బ్లాక్ టీని ఒక సమతుల్య ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.

షుగర్ కంట్రోల్..
బ్లాక్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు బ్లాక్ టీని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే, ఇది ఏదో ఒక మెడికల్ ట్రీట్‌మెంట్ లాగా పనిచేయదు, కానీ మీ డైట్ మరియు లైఫ్ స్టైల్ ప్లాన్‌లో దీనిని భాగంగా చేసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించుకోవడానికి మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

కడుపు ఆరోగ్యం..
బ్లాక్ టీ కేవలం మెదడు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి, జీర్ణ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మొత్తం శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES