రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే 5 అద్భుతమైన పండ్లు.. రోజుకు ఒకటి తిన్నా గుండె పదిలం!
పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైనవి, వీటిని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. దీని వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అంతేకాదు, ఐదు రకాల పండ్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్త సరఫరా మెరుగవుతుంది.
Heart Health Tips: బిజీ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ ఎక్సర్ సైజ్ తప్పనిసరి. దీంతో పాటు మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఉండే ఫుడ్స్ ఉండాలి. సాధారణంగా పండ్లు, కూరగాయలను మనం రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటూ ఉంటాం. వీటిలో కొన్ని ముఖ్యమైన పండ్లు ఉన్నాయి. ఐదు రకాల పండ్లను డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, ఆర్టరీస్ బ్లాక్ కాకుండా రక్త సరఫరా మెరుగవుతుంది. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకుని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి. తద్వారా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో మనం తీసుకునే డైట్ ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. కొన్ని రకాల పండ్లను రెగ్యులర్గా తీసుకోవడం మంచిది.
అరటిపండు:
దీని ధర సాధారణంగానే ఉంటుంది కాబట్టి సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ను అదుపులో ఉంచుతుంది. ఇది ఆర్టరీస్ను ఉపశమనం చేసి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది, దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీరు డయాబెటిస్తో బాధపడుతున్నవారైనా, బరువు తగ్గాలనుకునేవారైనా అరటిపండ్లను సాధారణంగా తీసుకోవచ్చు. అతిగా పండినవి కాకుండా, మీడియం రైపెన్ ఉన్న పండ్లను తీసుకోవాలి. బ్రేకఫాస్ట్‌లో, వర్కౌట్కు ముందు స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు పండ్లు తీసుకుంటే సరిపోతుంది.
పైనాపిల్:
ఇందులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా కాపాడతాయి. అంతేకాదు, ఇందులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే పైనాపిల్లో యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. రక్తహీనతతో బాధపడేవారు కూడా వైద్య సలహాతో తీసుకోవడం మంచిది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పైనాపిల్ తీసుకోవచ్చు.
నిమ్మకాయ:
ఇందులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంట సమస్యను తగ్గిస్తుంది. దీన్ని సలాడ్లో లేదా నీటిలో కలిపి వెజిటబుల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తిన్న తర్వాత నోటిని నీటితో పుక్కిలించడం మంచిది. ఆరెంజ్ కూడా రుచికరమైన పండు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కూడా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి.
నిమ్మకాయ మాదిరిగానే ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాలను బలంగా మారుస్తుంది.
మామిడి:
ఇది రుచికరమైనది.. దీనిని "కింగ్ ఆఫ్ ఫ్రూట్స్" అని కూడా పిలుస్తారు. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మామిడిపండు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అయితే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్త వహించాలి. పనీర్, బాదం, పల్లీలతో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
బొప్పాయి:
ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్ హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది, ఆర్టరీస్ బ్లాక్ కాకుండా కాపాడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఈ బొప్పాయిని ఉదయం బ్రేక్ఫస్ట్‌లో తీసుకోవచ్చు. రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు మితంగా మాత్రమే తీసుకోవాలి.
ఈ పండ్లు మాత్రమే కాదు, ఎల్లో బెల్ పెప్పర్ కూడా విటమిన్ సి, ఈ, కెరోటినాయిడ్స్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గించి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫైబర్, పొటాషియం బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. వీటిని సలాడ్ రూపంలో లేదా వేయించుకుని కూడా తీసుకోవచ్చు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తిన్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)