5 Delicious Egg Curries: కోడిగుడ్డు.. ఇది మంచి పోషకాహారం. దీనిలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, విటమిన్స్, ఐరన్, పాస్ఫరస్, జింక్, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలెన్నో పుష్కలంగా ఉంటాయి. అందుకై వైద్యులు కూడా రోజూ ఒక బాయిల్డ్ ఎగ్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సలహా ఇస్తుంటారు. అందుకే చాలా మంది గుడ్డును ప్రతిరోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటారు. అయితే మధ్యాహ్న భోజనంలో కానీ లేదా రాత్రి భోజనంలో కానీ తినేందుకు ఈ ఐదు రకాల రుచికరమైన గుడ్డు కూరలను ఓసారి ట్రై చేసి చూడండి.
టొమాటో కోడిగుడ్డు కూర:
టొమాటో కోడిగుడ్డు కూర చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. వండుతుంటేనే ఘమఘమలాడే వాసనతో నోట్లో నీళ్లూరుతుంటాయి. ఎర్రటి పండు టోమాటోలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీ వండుకోవాలి. అందులో ఉడికించిన గుడ్లను వేసి మసాలా దినుసులు వేసుకుంటే రుచి బాగుంటుంది.
షాహి ఎగ్ కర్రీ:
షాహీ ఎగ్ కర్రీ.. క్రీమీగా చిక్కగా.. అద్భుతంగా ఉంటుంది. గుడ్లు, పెరుగు, క్రీమ్, కసూరి మెంతి, సుగంధ మసాలాలతో కలిపి చేసుకుంటే..రుచి అదరహో అనాల్సిందే. చపాతీలు, లేదా అన్నంలోకి తినేందుకు రుచిగా ఉంటుంది. వారానికోసారైనా ఈ కర్రీ చేసుకోవచ్చు.
చెట్టినాడ్ ఎగ్ కర్రీ:
చెట్టినాడ్ ఎగ్ కర్రీ.. దక్షిణ భారతదేశంలో చాలా ఇష్టంగా తినే వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఇన్ స్టంట్ గా చేసుకునే రెసీపీల్లో చెట్టినాడ్ ఎగ్ కర్రీ ఒకటి. దీనిని అన్నం, పులావ్, రోటీ, చపాతీ ఇలా దేనికైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. దీన్ని నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు.
గోవాన్ స్టైల్ కోడి గుడ్డు కూర:
కొబ్బరి పాలు, చింతపండు, గసగసాలతో ఈ గోవాన్ స్టైల్ కోడి కూర చాలా ఫేమస్. ఈ కర్రీని చాలా తక్కువ సమయంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది.
ఎగ్ కర్రీ మసాలా:
ఎగ్ కర్రీ అనేది దాదాపు అందరి ఇళ్లలోనూ కామన్ గా చేసే వంటకం. కానీ రెగ్యులర్ గా కాకుండా కాస్త వెరైటీగా ఎగ్ కర్రీ మసాలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ మసాలా చేసుకుంటే చికెన్, మటన్ కూడా బలాదూర్ అని చెప్పాలి. ఇందులో మసాలాలే కీలకం. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి.
ఈ ఐదు రకాల ఎగ్ కర్రీలను ఉడికించిన గుడ్లతోనే తయారు చేసుకోవాలి. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎంతో సులభంగా వీటిని రెడీ చేసుకోవచ్చు. రోజూ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే.. పిల్లలు ఇష్టంగా తింటారు.