Reduce Anxiety Naturally: ఆధునిక జీవనశైలిలో ఒత్తిరితో పాటు ఆందోళన వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి.. అయితే, రోజు మొత్తాన్ని ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడపడానికి ఉదయం నిద్రలేచిన వెంటనే.. మనం అనుసరించే అలవాట్లు అత్యంత కీలకమని మానసిక ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఉదయాన్నే మన కళ్ళు చూసే దృశ్యాలు.. మనసు చేసే ఆలోచనలే రోజంతా మన మానసిక స్థితితో పాటు.. పనితీరును నిర్దేశిస్తాయని వారు చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా రోజు వారి పనులను కూడా చాలావరకు ఇవే ప్రభావితం చేస్తూ ఉంటాయని వారు అంటూ ఉన్నారు..
నిద్ర లేవగానే హడావిడిగా పనుల్లో పడడం లేదా ఫోన్ నోటిఫికేషన్లు చూస్తూ ఒత్తిడికి గురి కావడం వల్ల రోజంతా ఆందోళన వెంటాడుతుంది. దీనికి బదులుగా.. ఉదయం లేచిన వెంటనే ప్రశాంతమైన వాతావరణం లో కొంత సమయం గడపాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల మనసులోని అశాంతి తగ్గిపోయి.. మెదడు చురుకుగా పనిచేస్తుందట.. ఫలితంగా రోజంతా ఏకాగ్రతతో పనులు పూర్తి చేయగలుగుతారని మానసిక వైద్యులు చెబుతూ ఉన్నారు..
ఉదయం లేచిన వెంటనే లేలేత సూర్య కిరణాలను ఆస్వాదించడం మంచిదట.. అంతేకాకుండా ఇంటి చుట్టూ ఉండే పచ్చని చెట్లతో పాటు మొక్కలను చూడటం వల్ల కళ్లకు.. మనసుకు ఎంతో హాయి లభిస్తుందని మానసిక నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రకృతితో మమేకం అవ్వడం వల్ల శరీరంలో సానుకూల శక్తి విపరీతంగా పెరుగుతుందని.. దీనివల్ల ఒత్తిడి హార్మోన్లను తగ్గించి రోజంతా ఉల్లాసంగా ఉంటారని నిపుణులు తెలుపుతూ ఉన్నారు.
ఉదయం మంచి మంచి ఆలోచనలను పెంచే అద్భుతమైన కొటేషన్లు లేదా సానుకూలమైన మెసేజ్లు చదవడం అలవాటు చేసుకోవాలని వారు అంటున్నారు. ఇవి మన ఆలోచన విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా.. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని విపరీతంగా పెంచుతూ ఉంటాయట. అంతేకాకుండా ఉదయం లేవగానే మనకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల ముఖాలను చూడటం లేదా వారితో ఆప్యాయంగా మాట్లాడటం వల్ల మనసులో ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
ఈ సానుకూల భావన రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.. జీవనశైలిలో ఈ చిన్నపాటి మార్పులు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఉదయపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. రోజంతా ఆనందంగా విజయవంతంగా ముందుకు సాగవచ్చని నిపుణులు తెలుపుతున్నారు..