SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జీర్ణవ్యవస్థ ఇబ్బంది పెడుతుందా? కీవీ..వెల్లుల్లి! AIIMS డాక్టర్ సూచించిన సూపర్ ఫుడ్స్ ఇవే!

ఆరోగ్యకరమైన గట్‌ అనేది జీర్ణవ్యవస్థలో ఉన్న ట్రిలియన్‌ బ్యాక్టిరియాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మైక్రోబ్‌స్‌ కొన్ని రకాల ఫైబర్‌, మొక్కల సమ్మేళనాలను తీసుకుంటాయి. దీంతో మన గట్‌ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ ఫుడ్స్‌ చేర్చుకుంటే మీ జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. ఏయిమ్స్‌ వైద్యుల ప్రకారం మన డైట్‌లో ఎలాంటి ఫుడ్స్‌ ఉండాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 16, 2026, 12:00 PM IST | Updated: Sep 16, 2026, 12:04 PM IST
Image Credit: AIIMS Doctor Recommended gut health foods
Join

AIIMS Doctor Recommended gut health foods: ఏయిమ్స్‌ గ్యాస్ట్రోఎన్‌ట్రోలజిస్ట్‌ ఆరోగ్యకరమైన గట్‌ కోసం కొన్ని ఫుడ్స్‌ను సూచించారు. ఈయన హర్వార్డ్‌, స్టాన్‌ఫర్డ యూనివర్శిటీలో శిక్షణ కూడా పొందారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేధికంగా ఒక పోస్ట్‌ చేశారు. మొత్త ఏడు రకాల ఫుడ్స్‌ తీసుకుంటే జీర్ణ ఆరోగ్యంతోపాటు గట్‌  ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ ఫుడ్స్‌ ఏంటి తెలుసుకుందాం.

కీవీ..
కీవీ పండులో ఫైబర్‌ యాస్టినిడిన్‌ ఉంటుంది. ఇది ఒక సహజమైన జీర్ణ ఎంజైమ్‌. ఏయిమ్స్‌ వైద్యుల ప్రకారం రోజూ రెండు కీవీలు తింటే ఆరోగ్యరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది.

ప్లెయిన్‌ యోగార్ట్‌..
గట్‌ ఆరోగ్యానికి యోగార్ట్‌ది కీలక పాత్ర. ఇది గట్‌ మైక్రోబయోమ్‌కు సహాయపడుతుంది. అయితే, ప్రతి ఒక్క యోగార్ట్‌లో ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు దాని లేబుల్‌ క్షుణ్నంగా చదివి తీసుకోండి.

చియా సీడ్స్‌..
చియా సీడ్స్‌లో కరిగే, కరగని ఫైబర్‌ లభిస్తుంది. ఇది చూడటానికి కూడా జెల్‌ మాదిరి ఉంటుంది.  పైబర్‌ కూడా ఉంటుంది. చియా సీడ్స్‌ అల్లం కంటే ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది.

పప్పు ధాన్యాలు..
ఈ పప్పు ధాన్యాల్లో కూడా ఫైబర్‌తోపాటు స్టార్చ్‌ కూడా ఉంఉటందిన వైద్యుల ప్రకారం  ప్రతి వారంలో పప్పు ధాన్యాలను మన డైట్‌లో చేర్చుకోవాలి. ఇది గట్‌ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపండుతుంది.

ఓట్స్‌..
ఓట్స్‌లో కూడా బీటా గ్లూకోన్‌ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్‌.. అంతేకాదు ఓట్స్‌లోని ఈ గ్లూకోన్‌ మైబ్రోబ్‌తో ఫెర్మెంటేషన్‌ అవుతాయి. ఇది గట్‌ బ్యాక్టిరియాకు ఆహారంగా మారతుఉందని వైద్యులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి..
వెల్లుల్లిలో ఫ్రక్టన్స్‌  ఉంటాయి. ఇది మన గట్‌ బ్యాక్టిరియాకు ఒక ప్రీబయోటిక్‌లా పనిచేస్తుంది. ఏయిమ్స్‌ వైద్యుల ప్రకారం మన వండుకునే ఆహారంలో చివరగా ఓ ది నిమిషాల ముందు వెల్లుల్లి క్రష్‌ చేసి లేదా చిన్నగా కట్‌ చేసి వేయాలి. అప్పుడు మరికొన్ని అల్లిసిన్‌లు కూడా ఏర్పడతాయి.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

బెర్రీలు..
సాధారణంగా బెర్రీలు అంటేనే ఎంతో ఆరోగ్యకరం. బెర్రీ జాతికి చెందిన డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా మన గట్‌ ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రధానంగా బ్లూబెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీలు ఉంన్నాయి. ఇది గట్‌కు మంచివి. మీరు తాజా బెర్రీ పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ బెర్రీ పండ్లతోపాటు ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఫుడ్స్‌, పండ్లు, తృణ ధాన్యాల, ఫెర్మెంటెడ్‌ ఫుడ్స్‌తో కలిపి తీసుకోవాలి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES