SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తిన్నాక కడుపు ఉబ్బరంగా ఉందా? వాము నీళ్లు vs సోంపు నీళ్లు.. ఏది త్వరగా పనిచేస్తుంది?

ఒక్కోసారి స్పైసీ ఫుడ్ లేదా అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా అనిపిస్తుంది. ఈ సమయంలో వెంటనే ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తుంటాం. అయితే వాము నీళ్లు లేదా సోంపు నీళ్లు.. ఈ రెండిటిలో ఏది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది?

Written By Renuka Godugu
Published: Sep 25, 2026, 06:24 PM IST | Updated: Sep 25, 2026, 06:28 PM IST
Image Credit: Ajwain vs Saunf Water Benefits:
Join

Ajwain vs Saunf Water Benefits: అజీర్తి చేసినప్పుడు మన బామ్మల కాలంనాటి చిట్కాలు అమ్మలు చెబుతూనే ఉంటారు. వాటిని మనం పాటిస్తుంటాం. అయితే కడుపులో అజీర్తి అయినప్పుడు వాము నీళ్లు తాగాలా లేక సోంపు నీళ్లు తాగాలా? ఇవి రెండూ జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎప్పుడైనా హెవీగా భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా అనిపిస్తే ఈ రెండిటిలో ఏది తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది? జీర్ణ సమస్యలను దూరం చేసే అసలైన చిట్కా ఏంటో తెలుసా?

చాలామంది ఇంట్లో వాము, సోంపు ఉంటాయి. కడుపులో గ్యాస్ లేదా అజీర్తి కలిగితే వాము తక్షణమే ఉపశమనాన్ని ఇస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, కిచెన్‌లో ఉండే ఈ వామును ఒక శక్తివంతమైన వనరుగా పరిగణిస్తారు. మీరు అజీర్తిగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవచ్చు. వాములో థైమోల్ అనే సహజమైన నూనె ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. 2017 నివేదిక ప్రకారం, కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న 150 మందిపై ప్రయోగం చేశారు. ఇందులో వామును సెలరీతో కలిపి తీసుకోవడం వల్ల వారికి ఉపశమనం లభించింది. కేవలం వాము నీళ్లు మాత్రమే పనిచేయలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత కూడా గ్యాస్, అజీర్తి లక్షణాలు తగ్గినట్లు, కడుపు తేలికగా అనిపించినట్లు తెలిసింది. అయితే వాము నీళ్లు తాగడం వల్ల మాత్రమే మంచి రిలీఫ్ లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం.

సోంపును ఫెన్నల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. భోజనం తర్వాత నోట్లో వేసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా మారుతుంది. కడుపులో అజీర్తి కలిగినప్పుడు కూడా సోంపు తీసుకోవాలని చెబుతుంటారు. సోంపును జీర్ణక్రియ కోసం ఉపయోగిస్తారు. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోంపు నీళ్లు తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే 2020 నివేదిక ప్రకారం, అబ్డామినల్ సర్జరీ జరిగిన 381 మంది రోగులపై చేసిన పరిశోధనలో, సోంపు వల్ల నేరుగా ఉపశమనం లభించిందని చెప్పడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు.

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

Also Read: హోల్ మిల్క్ vs స్కిమ్డ్ మిల్క్.. గుండె ఆరోగ్యానికి ఏ పాలు బెస్ట్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

అయితే, వాము నీళ్లను మన చిన్ననాటి నుండి ఉపయోగిస్తున్నారు. కడుపులో గ్యాస్ లేదా అజీర్తి సమస్య ఉన్న పిల్లల నుండి పెద్దల వరకు వీటిని వాడుతుంటారు. సోంపు విషయానికి వస్తే, భోజనం తర్వాత దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. కాబట్టి మీ ఆరోగ్య అవసరాలను బట్టి వీటిని తీసుకోవడం మంచిది. సాధారణంగా భోజనం తర్వాత వాము నీళ్లను కడుపులో అజీర్తి కలిగినప్పుడు తీసుకుంటారు, ఇవి జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES