SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉసిరికాయతో ఒక్కసారి ఇలా రసం చేసి చూడండి.. జలుబు, దగ్గు మాయం! హెల్త్‌ బెనిఫిట్స్‌ అమోఘం!

మారుతున్న వాతావరణం నేపథ్యంలో మన డైట్‌లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రధానంగా ఏ సీజన్‌ మారిన ఇమ్యూనిటీ బూస్ట్‌ అయ్యే ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్‌ సీ ఇమ్యూనిటీ బూస్ట్‌ చేసే గుణాలు ఉంటాయి. వీటిని డైట్‌లో తీసుకోవాలి. ఇండియన్‌ గూస్‌బెర్రీ అని పిలిచే ఉసిరికాయలు తీసుకుంటే మంచివి. వీటితో రసం పెట్టుకుని తీసుకుంటే కూడా అదుర్స్‌. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉంటాయి.

Written By Renuka Godugu
Published: Oct 01, 2026, 11:56 AM IST | Updated: Oct 01, 2026, 12:01 PM IST
Image Credit: Amla Rasam Recipe
Join

సాధారణంగా సీజన్‌ మారినప్పుడు మిరియాలు ఇతర స్సైసెస్‌ వేసి ఘాటుగ స్పైసీ రసం తయారు చేసుకుని తీసుకుంటాం. అయితే, విటమిన్‌ సీ పుష్కలంగా ఉండే ఉసిరికాయతో రసం పెట్టుకుంటే రుచితోపాటు ఈ సీజన్‌లో మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్‌ అవుతుంది. ఈ రసం సీజన్‌లో ఒంటికి మంచి వేడి కూడా అందిస్తుంది.  ఉసిరిలో సహజంగా పులుపు ఉంటుంది. దీంతో రసం చేసుకుని తింటే విటమిన్‌ సీ మన శరీరానికి పుష్కలంగా అందుతుంది. తాజా ఉసిరితో రసం పెట్టుకుంటే రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.

ఉసిరి రసానికి కావాల్సిన పదార్థాలు..
మూడు ఉసిరికాయలు.. విత్తనం లేకుండా కట్‌ చేయాలి.
రెండు మీడియం సైజు టమోటాలు కూడా కట్‌ చేయండి
కందిపప్పు ఒక కప్పు. ఉడికించి రుబ్బి పెట్టాలి.
ఒక స్పూన్‌ జిలకర్ర
స్పూన్‌ మిరియాలు
ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కట్‌ చేసిన అల్లం ముక్కలు, ఒక టీ స్పూన్‌ నెయ్యి, రెండు కప్పుల నీరు, రుచికి తగిన ఉప్పు, కొద్దిగా ఇంగువ తీసుకోండి.

ఉసిరి రసం తయారు చేసుకునే విధానం..
ముందుగా టమోటాలు, ఉసిరి, పసుపు, ఉప్పు, ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. వీటిని రుబ్బి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ రసం ఒక సాస్‌ప్యాన్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉడికించిన పప్పు, మరో కప్పు నీరు పోయాలి. సిమ్‌ మంటపై బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ సమయంపాటు పెడితే రసం అసలు రుచి పోతుంది.

Also Read: అరటిపండు కంటే పవర్‌ఫుల్! ఈ ట్రోపికల్ ఫ్రూట్ తింటే శరీరంలో మార్పులు ఖాయం.. 

Also Read: డాక్టర్‌ రికమండ్ చేసిన డ్రింక్స్.. కీళ్ల నొప్పులు, బాడీ వాపులను తగ్గించే 5 పానీయాలు!

తాలింపు..
ఇప్పుడు మరో ప్యాన్‌ తీసుకుని నెయ్యి వేయాలి. ఆవాలు, జిలకర్ర చిటపటలాడించాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఇంగువ వేయాలి. ఇప్పుడు ఈ తాలింపును రసంలోకి వేసుకోవాలి. ఉప్పు రుచి చూడండి. ఇప్పుడు రసంలో కట్‌ చేసిన కొత్తిమీర కూడా వేయండి. వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది.

తాజాగా ఉసిరి మాత్రమే ఈ రిసిపీలో వాడండి. ఇది కొద్దిగా పులుపు, వగరుగా ఉంటుంది. రసం రుచి బాగుంటుంది. సిమ్మర్‌లో పెట్టి ఉడికించిన తర్వాత కూడా ఉప్పు, కావాల్సినంత నీరు పోసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES